– ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క
ములుగు,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 22: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మేడారం సందర్శించనున్నారు. సిఎం పర్యటన నేపథ్యంలో పంచాయితి రాజ్, గ్రాణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ, గ్రాణ నీటి సరఫరా శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క మేడారంలో అభివృద్ధి పనులను పరిశీలించారు. తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్, ఎస్పి షబరిష్‌లతో కలిసి దర్శించుకున్నారు. మంగళవారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి సీతక్క పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు, దిశానిర్దేశర చేశారు. సమావేశంలో ఎఎస్‌పి శివం ఉపాధ్యాయ, అదనపు కలెక్టర్ రెవిన్యూ సిహెచ్ .మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆర్ డిఒ వెంకటేష్, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గరావు, ఇఒ వీరస్వామి, ఎపిఓ వసంత రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సిఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మేడారం మహాజాతరకు సంబంధించిన పనులకు శంకుస్థాపన, గద్దెల మార్పుపై ఫైనల్ డిజైన్ విడుదల వంటి కీలక కార్యక్రమాలు ఈ సందర్శనలో భాగంగా ఉన్నాయి. మంత్రి సీతక్క ఈ సందర్భంగా పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు. పర్యటన సజావుగా సాగేలా భద్రత, రవాణా, ఇతర ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకోనున్నారు. ఆయన తొలుత సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుని ఆ తర్వాత మేడారం మహాజాతరకు సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదే సమయంలో గద్దెల మార్పుకు సంబంధించిన ఫైనల్ డిజైన్‌ను కూడా విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం మేడారం జాతరకు కొత్త ఒరవడిని అందించనుంది. సీఎం పర్యటన ఈ ప్రాంతంలో అభివృద్ధి, సాంస్కతిక వారసత్వ సంరక్షణకు ఊతమిస్తుందని స్థానికులు ఆశిస్తున్నారు. ఈ కార్యక్రమాలు రాష్ట్రంలో ఆధ్యాత్మిక, సాంస్కతిక పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అధికారులు, స్థానిక నాయకులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




