వంద రోజుల్లో మేడారం అభివృద్ధి పనులు

– బాసర, మేడారం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
– అధికారులను ఆదేశించిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 8: ‌మేడారం, బాసర ఆలయాలను భక్తుల మనోభావాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి  ఆదేశించారు. మేడారం అభివృద్ధి పనులు వంద రోజుల్లో పూర్తి చేయాలని, ఈ వారంలో తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని అధికారులకు చెప్పారు. జాతరకల్లా సుందరంగా తీర్చిదిద్దాలని అన్నారు. మేడారం, బాసర ఆలయాల అభివృద్ధి ప్రణాళికలపై సీఎం రేవంత్‌ ‌సోమవారం సక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల అభివృద్ధికి సంబంధించిన మాస్టర్‌ ‌ప్లాన్‌ను సీఎంకు అధికారులు వివరించారు. మేడారం అభివృద్ధికి సంబంధించిన పలు డిజైన్లను సీఎం పరిశీలించారు. మేడారం మహాజాతర నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. పూర్తిగా సహజసిద్ధమైన రాతి కట్టడాలతో నిర్మాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. భక్తులకు సౌకర్యంగా ఉండేలా ప్రవేశం, బయటకు వెళ్లే దారి, పార్కింగ్‌ ‌తదితర ఏర్పాట్లు ఉండాలి. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జంపన్న వాగులో నీరు నిలిచేలా చెక్‌ ‌డ్యామ్‌ల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలి. బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయ విస్తరణ, అభివృద్ధిలో స్థానిక నిపుణులు, పూజారుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సీఎం దిశానిర్దేశంచేశారు. ఈ సక్షలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *