– సిఎం ఇంటి కాంపౌండ్ కూల్చివేత
మహబూబ్‌నగర్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 08: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అందరికీ ఆదర్శంగా నిలిచారు. రోడ్డు విస్తరణలో భాగంగా సీఎం ఇంటి కాంపౌండ్‌ను అధికారులు కూల్చారు. ఇందుకు సీఎం అడ్డుచెప్పక పోగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం అయిన కొండారెడ్డిపల్లిలో రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం అధికారులు ముఖ్యమంత్రి ఇంటి కాంపౌండ్‌ను కూల్చారు. ఇంటి చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్ మొత్తంను పడగొట్టారు. ఇందుకు సీఎం సహా ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ డియా వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న జనాలు రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘సీఎం రేవంత్ రెడ్డి అందరికీ ఆదర్శం’, ‘సీఎం తల్చుకుంటే అక్కడ రోడ్డు వేయడాన్నే ఆపేవారు, కానీ ఆలా చేయలేదు’, ‘ప్రజల శ్రేయస్సే సీఎం కోరుకున్నారు’ అని కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





