హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: రాష్ట్రంలోని క్రైస్తవ సోదరులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గుడ్‌ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యేసు క్రీస్తు త్యాగం, ధైర్యాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. యేసు ప్రభువు ప్రేమ, కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని అభిýషించారు. శాంతి, కరుణ సందేశాలతోపాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదర భావం ఇప్పటికీ ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రపంచానికి ప్రేమతత్వం బోధించిన దయామయుడు, శిలువపై యేసు క్రీస్తు త్యాగం మహోన్నతమైనదని ‘గుడ్ ఫ్రైడే’ సందేశం సందర్భంగా సీఎం వెల్లడించారు. యేసు క్రీస్తు త్యాగాలకు జ్ఞాపకంగా గుడ్‌ఫ్రైడే వేడుకలను క్రైస్తవ సోదర సోదరీమణులందరూ ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




