ఆర్‌ఆర్‌ఆర్‌ పనుల ప్రారంభానికి అనుమతులివ్వాలి

– కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ

న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 9: రాష్ట్రాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, హైవేల మంజూరు, వరద సాయం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో తెలంగాణ సీఎం ఎ.రేవంత్‌ రెడ్డి మంగళవారం దిల్లీలో చర్చించారు. రీజినల్‌ రింగు రోడ్డుకు (నార్త్‌ పార్ట్‌) సంబంధించి 90 శాతం భూ సేకరణ పూర్తయినందున పనుల ప్రారంభానికి ఆర్థిక, కేబినెట్‌ అనుమతులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ నిబంధనలకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌కు అనగుణంగా రీజినల్‌ రింగు రోడ్డు (సౌత్‌ పార్ట్‌)కు అనుమతులు ఇప్పించాలని కోరారు. రావిర్యాల-ఆమన్‌గల్‌-మన్ననూర్‌ రహదారిని నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిగా నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. మన్ననూర్‌-శ్రీశైలం(ఎన్‌హెచ్‌ 765) నాలుగు వరుసల ఎలివేటెడ్‌ కారిడార్‌కు అనుమతించాలనికూడా కోరారు. హైదరాబాద్‌-మంచిర్యాల మధ్య నూతన గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిని జాతీయ రహదారిగా మంజూరు చేయాలని, హైదరాబాద్‌ భారత్‌ ఫ్యూచర్‌ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు 12 వరుసల గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారికి అనుమతి ఇవ్వాలని సీఎం కేంద్ర మంత్రిని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *