బస్సు ప్రమాదంపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

– మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం
– ఏపీ అధికారులతో మాట్లాడి సహాయ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం
– ఘటనాస్థలికి వెళ్లాలని గద్వాల్‌ కలెక్టర్‌, ఎస్పీ, జెన్‌కో సీఎండీల‌కు ఆదేశాలు
– కంట్రోల్‌ రూంలు, హెల్ప్‌ డెస్క్‌ల ఏర్పాటు
– ప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి దిగ్భ్రాంతి

కర్నూలు, అక్టోబర్‌ 24: కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకురు వద్ద శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ అగ్నిప్రమాదానికి గురైన దుర్ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డిలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సీఎం అంధ్రప్రదేశ్‌ అధికారులతో మాట్లాడి తగు సహాయక చర్యలు చేపట్టాలని, తక్షణమే హెల్ప్‌ లైన్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందించేందుకు ఘటనా స్థలానికి వెళ్లాలని గద్వాల్‌ కలెక్టర్‌, ఎస్పీ, జెన్‌కో సీఎండీ హరీష్‌లను ఆదేశించారు. మృతుల గుర్తింపుతోపాటు క్షతగాత్రులకు అవసరమైన వైద్యసాయం అందించే చర్యలు ముమ్మరం చేయాలన్నారు. ఇదిలావుండగా బస్సు ప్రమాద ఘటనపై ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బస్సులో మొత్తం ప్రయాణికులు 43మంది ప్రయాణిస్తుండగా వారిలో 23మంది ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకుని బయటపడ్డారు. మృతులలో 11మందిని గుర్తించారు. మిగతా వారిని గుర్తించాల్సి ఉంది. కాగా, బస్సు ప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

కర్నూలు బస్సు ప్రమాదం.. హెల్ప్‌లైన్‌ ఏర్పాటు
తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాలతో బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసింది.
హెల్ప్‌ లైన్‌ నెంబర్లు.. సంప్రదించాల్సిన అధికారులు:
9912919545 ఎం.శ్రీరామచంద్ర, అసిస్టెంట్‌ సెక్రటరీ
9440854433 ఇ.చిట్టిబాబు, సెక్షన్‌ ఆఫీసర్‌
కర్నూలు కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ : 08518-277305.
కర్నూలు ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ : 9121101059, 9100901604
ఘటనాస్థలి వద్ద కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ : 9121101061.
కర్నూలు పోలీస్‌ ఆఫీసు కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ : 9121101075.
కర్నూలు ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌ హెల్ప్‌ డెస్క్‌ నంబర్లు : 9494609814, 9052951010.
గద్వాల్‌ కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూం నం 9502271122
కలెక్టరేట్‌లోని హెల్ప్‌ డెస్క్‌ నం. 9100901599, 9100901598
గద్వాల్‌ పోలీస్‌ ఆఫీసు కంట్రోల్‌ రూమ్‌ నం.8712661828
వివరాలకు బాధిత కుటుంబాలు పై నంబర్లకు ఫోన్‌ చేసి సంప్రదించవచ్చని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బి.ఎం.సంతోష్‌ తెలిపారు. సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికుల వివరాలకు పట్టికను చూడండి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *