హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 7: సీఎం కప్-2025 సెకండ్ ఎడిషన్ పోస్టర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో క్రీడలు, యువజనుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, సోనీబాల తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు గ్రామస్థాయి, 28 నుంచి 31వ తేదీ వరకు మండలస్థాయి, ఫిబ్రవరి 3 నుంచి 7వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయి, ఫిబ్రవరి 10 నుంచి 14వ తేదీ వరకు జిల్లాస్థాయి, 19 నుంచి 26వ తేదీ వరకు రాష్ట్రస్థాయి పోటీలు జరుగనున్నాయి. మొత్తం 44 రకాల క్రీడల్లో పోటీలు నిర్వహించనున్నట్లు మంత్రి శ్రీహరి వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



