జిల్లాల్లో ముమ్మరంగా సాగుతున్న సీఎం కప్

– పలు మండలాల్లో కొనసాగుతున్న టార్చ్ రిలే
– ఉత్సాహంగా పాల్గొంటున్న యువ క్రీడాకారులు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9: స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండో విడత సీఎం కప్–2026కు విస్తృత ప్రచారం కల్పించడంతోపాటు గ్రామీణ క్రీడాకారుల్లో అవగాహన పెంపొందించేందుకు చేపట్టిన క్రీడా జ్యోతి ర్యాలీలు రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల వ్యాప్తంగా పలు మండలాల్లో ఈ క్రీడాజ్యోతి ర్యాలీలు దిగ్విజయంగా కొనసాగుతూ క్రీడాకారుల్లో ఉత్సాహం నింపుతున్నాయి. పలు జిల్లా కేంద్రాల్లో జరుగుతున్న కార్యక్రమాల్లో ఆయా జిల్లాల జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లతోపాటు వివిధ శాఖల అధికారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. శుక్ర‌వారం సిద్దిపేట జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, తూర్పు నిర్మల జయప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు..వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డి పాల్గొన్నారు. అలాగే మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి.సంతోష్, స్థానిక ఎమ్మెల్యే కె.రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. మరో కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు, అదనపు కలెక్టర్ తదితర అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మ‌ల్యే సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారుఈ క్రీడాజ్యోతి ర్యాలీలు 17వ తేదీ వరకు కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *