సివిల్స్‌ మెయిన్స్‌కు ఎంపికైన వారికి సీఎం అభినందనలు

\హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 12 : రాష్ట్రం నుంచి సివిల్స్‌ మెయిన్స్‌ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు. యూపీఎస్సీ మెయిన్స్‌-2025 ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. రాష్ట్రం నుంచి సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది. సివిల్స్‌ సాధించే లక్ష్యంతో ప్రిపేరయ్యే పేద కుటుంబీకులకు అండగా నిలిచేందుకు గత ఏడాది రాజీవ్‌ సివిల్స్‌ అభయ హస్తం పథకాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది కూడా ఈ పథకం కింద సింగరేణి సంస్థ అధ్వర్యంలో 202మందికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది. రాజీవ్‌ సివిల్స్‌ అభయ హస్తం సాయం అందుకున్న అభ్యర్థుల్లో 43మంది తాజాగా యూపీఎస్సీ మెయిన్స్‌ ఫలితాల్లోనూ విజేతలుగా నిలిచారు. రాష్ట్రం నుంచి మెయిన్స్‌ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. వీరందరికీ గతేడాది మాదిరిగా ఈసారి కూడా ఇంటర్వ్యూలకు సన్నద్ధం అయ్యేందుకు మరో రూ.లక్ష ప్రోత్సాహకం అందించనున్నట్లు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *