– ముగిసిన ఇష్టాగోష్ఠి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన సందర్భంగా మంత్రులందరినీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అభినందించారు. అందరం కలిసికట్టుగా పనిచేయడం వల్లే మంచి ఫలితాలు సాధించామని పేర్కొన్నారు. పార్టీ విజయం కోసం శక్తి వంచన లేకుండా కృషిచేసిన పార్టీ కార్యకర్తలకు సీఎం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనులను ప్రజా ప్రభుత్వం రెండేళ్లల్లో చేసి చూపించిందని చెప్పారు. రెండేళ్లలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజా పాలనపై నమ్మకాన్ని కలిగించాయనడానికి ఈ ఫలితాలు నిదర్శనమన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్దామని అన్నారు. ఎన్నికలు ఏవైనా ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని మంత్రులకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ ంష్ట్రంలోని మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను దేశంలోనే ఆదర్శంగా దిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ వారికి దిశానిర్దేశం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





