హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21: 4వ ఈఎంఆర్‌ఎస్ నేషనల్ స్పోర్ట్స్ మీట్-2025లో రికార్డ్-బ్రేకింగ్ మెడల్స్ సాధించిన తెలంగాణ అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్, జూడో, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, టైక్వాండో, యోగా, షూటింగ్, చెస్ ఇతర ఈవెంట్లకు చెందిన విద్యార్థులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణ అత్యధికంగా 230 పతకాలను సాధించిన విషయం విదితమే. ఒడిశాలో ఇటీవల జరిగిన ఈ నేషనల్ స్పోర్ట్స్ మీట్-2025 పోటీల్లో తెలంగాణలోని 23 ఈఎంఆర్‌ఎస్ సంస్థలకు చెందిన విద్యార్థులు 580మంది పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఈ జాతీయ క్రీడా పోటీల్లో 22 రాష్ట్రాలలోని 499 ఈఎంఆర్‌ఎస్ సంస్థలకు చెందిన 5,500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 22 ఈవెంట్లలో పోటీలు నిర్వహించగా ఇందులో వ్యక్తిగత ఈవెంట్లు 15, జట్టు ఈవెంట్లు 7 ఉన్నాయి. వ్యక్తిగత, జట్టు ఈవెంట్లలో అత్యుత్తమ ప్రదర్శనను ప్రదర్శించి మొత్తం 714 పాయింట్లతో అద్భుతమైన ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను తెలంగాణ విద్యార్థులు కైవసం చేసుకున్నారు. విద్యార్థులను అభినందించిన వారిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఉన్నతాధికారులు ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




