హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: మాజీ డీజీపీ హెచ్.జె.దొర మతిపట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా, డీజీపీగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. పోలీసు శాఖలో పలు సంస్కరణలు తీసుకురావడంతోపాటు శాఖను ప్రజలకు చేరువ చేయడంలో ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు.
దొర మృతిపట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం
మాజీ డీజీపీ హెచ్.జె.దొర మరణ వార్త తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీగా వారు చేసిన సేవలు, శాంతిభద్రతలను కాపాడటంలో నీతి, నిజాయతీ, నిబద్ధత, పరిపాలనా సామర్థ్యం ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. జాతీయ స్థాయిలో కేంద్రంలోనూ సీఐఎసఎఫ్ డైరెక్టర్‌గా వారు సేవలందించారని, ప్రత్యేకంగా పుట్టపర్తిలో శ్రీ సత్యసాయిబాబా ఆశ్రమానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కూడా పోలీసు వ్యవస్థలో సంస్కరణల కోసం వారు సేవలందించారని గుర్తు చేశారు. హెచ్‌జే దొర మృతి పోలీస్ రంగానికి తీరనిలోటు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ దొర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాననన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



