– అధికారంలో ఉంటూ ఈ సర్టిఫికెట్ పొందిన తొలి సీఎం రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. లీడర్‌షిప్ అనే కోర్సును పూర్తి చేసి సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని పొందారు. ఈనెల 25న ఈ కోర్సు ప్రారంభమవగా 30 వరకు అంటే వారం రోజులపాటు నిర్వహించారు. ఈ కోర్సులో సీఎం రేవంత్‌తోపాటు 62 మంది కోహోర్ట్ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. 20కిపైగా దేశాల నుంచి ప్రతినిధులు ఇందులో భాగస్వాములయ్యారు. అమెరికాలోని కేంబ్రిడ్జ్‌లో మైనస్ 24 డిగ్రీల తీవ్ర చలిలోనూ రేవంత్ రెడ్డి ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తరగతులకు హాజరయ్యారు. కేస్ స్టడీలు, గ్రూప్ డిస్కషన్లు, కన్సల్టేటివ్ వర్క్‌లతో కూడిన ఇంటెన్సివ్ ప్రోగ్రామ్‌లో భాగంగా అధికారం, నాయకత్వం, సంఘర్షణలు, అనిశ్చితి వంటి అంశాలపై శిక్షణ పొందారు. ప్రోగ్రామ్ ముగిసిన సందర్భంగా హార్వర్డ్ అధ్యాపకులు రేవంత్ రెడ్డితోపాటు మిగిలిన 62 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అయితే భారత దేశ చరిత్రలో అధికారంలో ఉంటూ హార్వర్డ్ నుంచి ఈ రకమైన సర్టిఫికెట్ పొందిన తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డ్డు సష్టించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





