ముందుచూపులేని విజన్‌!!

“పాలనను పీపీపీపీ విధానంలో ధనవంతులకు అప్పగించ డాన్ని చూస్తుంటే చంద్రబాబు విజన్‌ ఉన్నత వర్గాలకు తప్ప ప్రజలకోసం కాదనేది స్పష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఒక ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవడం ఎట్లా సాధ్యమవుతుంది? అసలు ఈ సంపద సాధారణ ప్రజలకు ఎట్లా చేరుతుందనేది ఈ విధానం వివరించలేకపోతున్న ది. చూస్తుంటే పరిపాలనను అర్థం చేసుకోవడంలోనే ప్రాథమికంగా లోపం ఉన్నదనేది సుస్పష్టం. అందరినీ భాగస్వాములను చేయకుండా చూపే అభివృద్ధి విజన్‌ సరైంది కాదు. కేవలం ఆధునిక ‘‘పొటెంకిన్‌ ఆర్థిక వ్యవస్థ’’ గానే మిగిలిపోవడం తప్ప!”

ముందుచూపులేని విజన్‌ ఇంజన్‌ లేని కారు లాంటిది! చూడటానికి అద్భుతంగా ఉంటుంది.. కానీ మీరెక్కడికి వెళ్లాలనుకుంటున్నారో అక్కడికి ఎప్పటికీ చేరుకోలేరు! ఈ ‘‘ముందుచూపులేని విజన్‌’’ తక్షణం పైకి కనిపించే సాధించిన అంశాలను చూపుతుంది తప్ప, దీర్ఘకాలంలో చోటుచేసుకునే పరిణామాలు, అడ్డంకులు, సుస్థిరతకు కావలసిన వనరులకు ఎటువంటి ప్రాధాన్యత ఇందులో కనిపించదు. 18వ శతాబ్దంలో రష్యాను పాలించిన రాజు గ్రిగొరీ పొటెంకిన్‌ నైపర్‌ నది ఒడ్డున (సరిగ్గా నేటి కృష్ణానది ఒడ్డున నిర్మించే అమరావతి నగరం మాదిరిగా) ఏవిధమైన ప్రయోజనం లేని ఒక గ్రామాన్ని నిర్మించాడు.

ఇందులో అద్భుతమైన భవనాల నిర్మాణం జరిగింది. ఇంతకూ ఆయన ఈ గ్రామాన్ని నిర్మించడానికి ఒక కారణముంది. అప్పటికి కొత్తగా స్వాధీనం చేసుకున్న క్రిమియా భూభాగాలు తన పాలనలో ఎంత సుసంపన్నతతో అలరారుతున్నాయో రాణి కేథరిన్‌ ది గ్రేట్‌కు చూపి, సంతుష్టురాలిని చేయడం ఆయన ప్రధాన ఉద్దేశం.ఈ గ్రామ నిర్మాణంతో గ్రిగొరీ పొటెంకిన్‌కు తాత్కాలికంగా గొప్ప నాయకుడిగా గుర్తింపు వచ్చినప్పటికీ, తర్వాతి కాలంలో అసలు బండారం బయటపడిరది. నిరుపయోగంగా మిగిలిన అద్భుత భవనాలు, నిప్పచ్చర పాలన అసలు రంగు బయటపడి ప్రజల్లో అవహేళనకు గురైన రాజుగా చరిత్రలో మిగిలిపోయాడు.

సమకాలీన రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన సరిగ్గా దీన్నే తలపిస్తున్నది. కార్పొరేట్‌ ఎక్స్‌లెన్స్‌కు గుర్తింపుగా ఎకనామిక్‌ టైమ్స్‌ ఆయనకు ఇటీవల ‘‘బిజినెస్‌ రీఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌` 2025’’ అవార్డును ప్రదానం చేసింది. రాష్ట్రానికి రూ.10.7లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినందుకు గుర్తుగా ఈ పురస్కారం లభించింది. అయితే విమర్శకులు మాత్రం చంద్రబాబు పాలనను సరిగ్గా ‘‘పొటెంకిన్‌ భవనాల’’కు ఎంతమాత్రం తీసిపోని రీతిలో ఉన్నదని విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా కీలక ఆర్థిక ప్రాధాన్యతలను ఏమాత్రం పట్టించుకోకుండా, విధానపరంగా ఎప్పటికప్పుడు పిల్లిమొగ్గలు వేస్తూ, పైకి ప్రజలను మభ్యపెడుతూ నెట్టుకొస్తున్నారంటూ ప్రధానంగా వారు వేలెత్తి చూపుతున్నారు. దీన్నే వారు ‘పొటెంకిన్‌ ప్యారలల్‌’ అని ఎద్దేవా చేస్తున్నారు.

ముఖ్యంగా తాను అమలు చేస్తున్న వాణిజ్య/ఆర్థిక సంస్కరణల వల్లనే పెద్ద వాణిజ్య సంస్థలు రాష్ట్రంలోకి అడుగు పెడుతున్నాయని, తనలోని ఈ నైపుణ్యానికి గుర్తింపే ఈ పురస్కారాల ని ఆయన ప్రజలను తన ప్రచార హోరులో ముంచెత్తవచ్చు. కానీ అనుసరించే ఆర్థిక విధానాల్లో పైకి కనిపించని లొసుగులను కప్పిపుచ్చడం కోసమేఈ ప్రచార పటాటోపమన్న సత్యాన్ని ఆయన ఎంతకాలం మరుగున ఉంచగలరు? ముఖ్యంగా స్వయం సమృద్ధంగా ‘‘రైస్‌ హబ్‌’’గా పేరుపొందిన రాష్ట్రం, క్ర మంగా ఆదాయమే పరమావధిగా ‘‘మద్యం ఆధారిత అభివృద్ధి’’ దిశగా పరిణామం చెందడం వర్తమాన చరిత్ర చెబుతున్న సత్యం!2024`25 ఎక్సైజ్‌ విధానం ప్రధానంగా ‘‘మద్యం ఆధారిత అభివృద్ధి’’ పై దృష్టి కేంద్రీకరించడం వల్ల, సంప్రదాయంగా వస్తున్న సుస్థిర వ్యవసాయం తో ముడిపడిన సంక్షేమం పూర్తిగా మరుగునపడిపోతున్నదని విమర్శకుల వాదన. చంద్రబాబు ప్రధానంగా ‘‘పి4’’ విధానాన్ని అనుసరిస్తున్నట్టు చెబుతా రు.

అంటే ‘‘ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు, భాగస్వామ్యం’’! మొత్తంమీద చె ప్పాలంటే చంద్రబాబు పాలన ప్రధానంగా ప్రైవేటీకరణపై ఆధారపడింది . పట్టణ మౌలిక సదుపాయాల నుంచి వైద్య విద్య వరకు ప్రైవేటీకరణ జరగా లన్నదే ఆయన ఉద్దేశం. పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా చెబుతున్నా, మొత్తంగా రాష్ట్రాన్ని కార్పొరేట్‌ మేనేజ్‌మెంట్‌ కిందికి తీసుకెళుతున్నారని విమర్శకుల ప్రధాన ఆరోపణ. ఆ విధంగా ఆయన తమను ఎన్నుకున్న వారికం టే, ధనికులకే మేలు జరిపే విధంగా విధానాలను అమలు చేస్తున్నారని వారు ఎత్తి చూపుతున్నారు. ముఖ్యంగా రెండెకరాల నుంచి ఆయన అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడిగా ఎదగడమే ‘‘బూటకపు హార్మ్యాల’’ ను మరోసారి బయటపెడుతోందని వారి ఆరోపణ. ప్రస్తుతం ఆయన సుమారు రూ.930 కోట్ల ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకుల్లో ఒకరిగా ఎదగడాన్ని చూస్తుంటే, ఆయన విజన్‌ నిజమైన సంపద సృష్టి ఎవరికి జరుగుతుందో స్పష్టమవుతోందని వారి విమర్శ. ప్రస్తుతం ‘‘సంపద సృష్టి’’ నినాదం ఊదరకొట్టుడుకు తప్ప, నిజమైన లబ్దిదారుల ప్రయోజనాకు ఎటువంటి ఉపయోగం ఉండటం లేదు. వ్యక్తిగత/ప్రైవేటు ఆస్తులు విపరీతంగా పెంచుకోవడం తప్ప పేదల సంపద వృద్ధి ఎక్కడా కనిపించడం లేదు.

పాలనను పీపీపీపీ విధానంలో ధనవంతులకు అప్పగించ డాన్ని చూస్తుంటే చంద్రబాబు విజన్‌ ఉన్నత వర్గాలకు తప్ప ప్రజలకోసం కాదనేది స్పష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఒక ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవడం ఎట్లా సాధ్యమవుతుంది? అసలు ఈ సంపద సాధారణ ప్రజలకు ఎట్లా చేరుతుందనేది ఈ విధానం వివరించలేకపోతున్న ది. చూస్తుంటే పరిపాలనను అర్థం చేసుకోవడంలోనే ప్రాథమికంగా లోపం ఉన్నదనేది సుస్పష్టం. అందరినీ భాగస్వాములను చేయకుండా చూపే అభివృద్ధి విజన్‌ సరైంది కాదు.

కేవలం ఆధునిక ‘‘పొటెంకిన్‌ ఆర్థిక వ్యవస్థ’’ గానే మిగిలిపోవడం తప్ప! 2025 సంవత్సరానికి బిజినెస్‌ రిఫార్మర్‌ పురస్కారాన్ని చేతిలో ఉంచుకున్న చంద్రబాబు, ప్రేక్షకులకు ‘‘కిత్‌నే సప్నే కిత్‌నే ఆర్మా లాయా హు మై, దేఖోనా దేఖోనా/హే మేరా దిల్‌ భీ ఏక్‌ మెప్‌ాఫిల్‌ హై తుమ్‌ భీ కభీ ఆవో నా బైఠోనా’’ (నాతో ఎన్నో కలలను తీసుకువచ్చాను/ఒక్కసారి చూడండి, దయచేసి చూడండి ఒక్కసారి/ నాహృదయంలో పదిలంగా ఉన్నాయి/ ఒక్క సారి లోపలికి రాలేరా? కూర్చొని, ఇక్కడే ఉండలేరా?) అనే బాలీవుడ్‌ పాటతో చక్కటి సంగీతాన్ని వినిపిస్తున్నారనుకోవాలి. ఈ వాయిద్యంతో ఆయన చక్కటి తన విజన్‌ను వినిపిస్తున్నారు!! తన ప్రైవేటు అసెంబ్లీకి అంతర్జాతీయ పెట్టుబడిదార్లను ఆహ్వానిస్తున్నారు. పొటెంకిన్స్‌ హార్మ్యాల మాదిరిగానే పైకి కనిపించే తన ముషాయిరాలో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను అన్నపూర్ణగా నిలిపిన రైతులు, కూలీలకు స్థానం ఉంటుందా అనేది ప్రశ్న!
-శామ్ సుందర్
పొలిటికల్ అనలిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *