భట్టి తనయుడి రిసెప్షన్‌కు సీఎం హాజరు

– మంత్రులు, ప్రముఖులు, ఉన్నతాధికారులు కూడా

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తనయుడు సూర్య- సాక్షిల రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుదిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగు రాష్ట్రాల రాజకీయ ఉద్దండులు, ప్రముఖులు, ఉన్నత అధికారులు ,కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, జేడీ శీలం, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, సిడబ్ల్యుసి సభ్యులు రఘువీరా రెడ్డి, టి.సుబ్బిరామిరెడ్డి, గిడుగు రుద్రరాజు, సిపిఐ జాతీయ నేత కే.నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంపీలు మల్లు రవి, సీఎం రమేష్, మాజీ ఎంపీలు కెవిపి రామచంద్రారావు, ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్, వి.హనుమంతరావు, విజయసాయి రెడ్డి, కేశినేని నాని, వైఎసఆర్ సీపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, అంబటి రాంబాబు, బిఆర్‌ఎస్ నేతలు, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రముఖ సినీ నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, డిజిపి శివధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *