– అమ్మలను దర్శించుకుని నిలువెత్తు బంగారం సమర్పణ
– అభివృద్ధి పనులకు సంబంధించి మాస్టర్ ప్లాన్‌పై సమీక్ష
– పర్యటన ఏర్పాట్లలో అన్నీ తానై వ్యవహరించిన సీతక్క
మేడారం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23: రేవంత్‌రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ములుగు జిల్లా మేడారం వచ్చారు. ఆయనకు సమ్మక్క`సారలమ్మ జాతర ప్రాంగణం వద్ద ములుగు ఎమ్మెల్యే అయిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ పీవో తదితర ఉన్నతాధికారులు, స్థానికులు ఘనస్వాగతం పలికారు. ముందుగా సమ్మక్క`సారక్కల గద్దెలను దర్శించుకని నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించుకున్నారు. ఆయన వెంట మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. అమ్మల దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించి పూజారులు, ఆదివాసీలైన స్థానికులతో, అధికారులతో మేడారం అభివృద్ధి ప్రణాళికపై సమీక్ష ప్రారంభించారు.
మూడు రోజులుగా అక్కడే.. అన్నీ తానై చూసుకున్న సీతక్క
మేడారానికి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి వచ్చిన సందర్భంగా అక్కడ ఉత్సాహపూరిత, పండుగ వాతావరణం నెలకొంది. సీఎంకు ఘన స్వాగతం పలికేందుకు వేలాదిమంది భక్తులు, స్థానిక ప్రజలు నిరీక్షించారు. ములుగు ఎమ్మెల్యే అయిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మూడు రోజులుగా మేడారంలోనే మకాం వేసిన సీఎం పర్యటన ఏర్పాట్లను అన్నీ తానై చూసుకున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతోపాటు అన్ని శాఖల అధికారులను సమన్వయం చేస్తూ ఒక్కొక్క అంశాన్ని స్వయంగా పరిశీలించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





