అదృష్టంతోనే విజయం వరించదు

– కృషి, లక్ష్యం ఉంటేనే సాధ్యం
– గ్లోబల్ మ్యాప్‌లో తెలంగాణ అగ్రస్థానమే లక్ష్యం
– హార్వర్డ్‌లో భారతీయ విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: విజయం అనేది అదృ ష్టం వల్ల రాదని.. నిరంతర కృ షి, లక్ష్యం పట్ల స్పష్టత ఉంటేనే సాధ్యమని తన విజయ మంత్రాన్ని సిఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్‌లో విద్యార్థులకు బోధించారు. భారతీయ విద్యార్థుల ప్రత్యేక ఆహ్వానం మేరకు సిఎం రేవంత్ క్యాంపస్‌ను సందర్శించారు . ఈ మేరకు విద్యార్థులతో తన ఆలోచనలను పంచుకున్నారు. కెరీర్ ప్రారంభంలో ఎదురయ్యే ఒడుదొడుకులను ఎలా అధిగమించాలో విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విజన్ తెలంగాణను గ్లోబల్ మ్యాప్‌లో అగ్రస్థానంలో నిలబెట్టడమే తన ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను కేవలం ఐటీ హబ్‌గానే కాకుండా అన్నిరంగాల్లో నూ మేటిగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటోంది. తన పర్యటనలో భాగంగా సీఎం పలు కీలక సమావేశాలు, అంతర్జాతీయ సంస్థలతో చర్చలు, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో భారతీయ విద్యార్థులతో జరిగిన భేటీ.. రాజకీయ, విద్య, ఆర్థిక వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. సీఎం అమెరికా పర్యటన తెలంగాణకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే కాకుండా విదేశాల్లో ఉన్న విద్యార్థులను రాష్టాభ్రివృద్ధిలో భాగస్వాములను చేసేలా ఉంది. విద్యార్థులతో జరిగిన చర్చా గోష్ఠిలో సీఎం రేవంత్ తన రాజకీయ ప్రస్థానాన్ని, ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ’ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించారు. తెలంగాణ అభివ ద్ధిలో అంతర్జాతీయ ప్రమాణాలను ఎలా పాటిస్తున్న‌దీ చెప్పారు. భారతదేశ అభివృ ద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమని సీఎం అభిప్రాయపడ్డారు. విద్యార్థులు పొందుతున్న ఈ ప్రపంచ స్థాయి విద్య, కేవలం మీ కెరీర్ కోసమే కాకుండా దేశాభివృ ద్ధికి ఉపయోగపడాలని మార్గనిర్దేశర చేశారు. భారతీయ యువత మేథస్సు ప్రపంచాన్ని శాసిస్తోందని వ్యాఖ్యానించారు. హార్వర్డ్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు, అంతర్జాతీయ వేదికలపై హైదరాబాద్, తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన అవకాశాల గురించి ప్రపంచానికి చాటి చెప్పాలని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *