బీసీ రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాం

– సమస్యలు రావద్దనే డెడికేషన్‌ కమిషన్‌ వేశాం
` చిత్తశుద్ధి ఉన్నందునే బిల్లు ఆమోదానికి పెట్టాం
– కేసీఆర్‌ సభకు వచ్చి ఉంటే పెద్దరికం పెరిగేది
– ఆయన పార్టీ లాబీయింగ్‌ వల్లే రాష్ట్రపతి వద్ద పెండింగ్‌
` శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 31: బీసీల రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో బీసీ బిఉ్లపై ఆదివారం చర్చ ప్రారంభమైంది. బీహార్‌, రాజస్థాన్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో అడ్డంకులు వచ్చాయని సభ్యుడు గంగుల కమలాకర్‌ గతంలో చెప్పారని, అలాంటి అడ్డంకులు తెలంగాణలో రాకూడదనే అధికారుల కమిటీని, మంత్రులను పంపించి ఇతర రాష్ట్రాలలో సమాచారాన్ని సేకరించామన్నారు. న్యాయపరం సమస్యలను పరిశీలించిన తరువాతనే హైకోర్టు సూచన మేరకు డెడికేషన్‌ కమిషన్‌ను నియమించామన్నారు. ఈ మొత్తం ప్రక్రియ 2024 ఫిబ్రవరి 4న మొదలుపెట్టి 2025 ఫిబ్రవరి 4కు 365 రోజుల్లో పకడ్బందీగా చట్టాన్ని చేసి స్థానిక సంస్థల్లో బలహీనవర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని వివరించారు. మంత్రివర్గ తీర్మానం చేసి శాసనసభలో ఆమోదించుకుని విద్య, ఉద్యోగ రంగాల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు రెండు వేర్వేరు బిల్లులను గవర్నర్‌కు పంపించామన్నారు. అయితే గవర్నర్‌ వాటిని రాష్ట్రపతికి పంపారని, ఐదు నెలలుగా ఆ రెండు బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండిరగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికలపై కొందరు హైకోర్టుకు వెళ్లగా సెప్టెంబరు 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. 2018లో ఆనాడు కేసీఆర్‌ తీసుకొచ్చిన చట్టం ఇపుడు గుదిబండగా మారిందని, అందుకే తమ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చి 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని గవర్నర్‌కు పంపామని, గవర్నర్‌ వీళ్ల మాటలు నమ్మి ఆ ఆర్డినెన్స్‌ను కూడా రాష్ట్రపతికి పంపారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్డినెన్స్‌ ఆమోదం పొందనందున ఆ బిల్లును సభలో ఇవాళ ఆమోదించుకుందామని అంటే ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే సంతోషంగా ఉండేవారిలో మొదటి వరుసలో గంగుల కమలాకర్‌ ఉంటానని స్పష్టంగా చెప్పారు కానీ వాళ్ల నాయకులు సంతోషంగా ఉంటారని చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. బీసీ బిల్లు వెనుక లాబీయింగ్‌ జరిగిందన్నారు.

అయిదుసార్లు లేఖ రాశా.. అపాయింట్‌మెంట్‌ లేదు

దిల్లీికి అఖిలపక్షాన్ని తీసుకెళ్లలేదని గంగుల మాట్లాడుతున్నారు.. అయిదుసార్లు ప్రధానికి లేఖ రాసి అపాయింట్‌మెంట్‌ కోరినా ఇవ్వలేదని తెలిపారు. అందుకే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జంతర్‌ మంతర్‌ దగ్గర ధర్నా చేపడితే దాదాపు వందమంది వివిధ రాష్ట్రాల ఎంపీలు వచ్చి మద్దతు ఇచ్చారు కానీ బీఆర్‌ఎస్‌ ఎంపీలు మాత్రం అటువైపు కన్నెత్తి చూడలేదన్నారు. అంటే బీసీలకు 43 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి వాళ్ల పార్టీ నాయకుడు సిద్ధంగా లేరు అని విమర్శించారు. ఇవాళ కూడా సభలో గందరగోళం సృష్టించి బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుపడుతున్నారన్నారు. ఇలాంటి వారికి కనువిప్పు కలగడానికి ఫిబ్రవరి 4ను సోషల్‌ జస్టిస్‌ డేగా జరుపుకోవాలని నిర్ణయించామని రేవంత్‌రెడ్డి చెప్పారు. వందేళ్లుగా చేయని పని మేం చేసినందుకు మమ్మల్ని అభినందించి ఉంటే కెసీఆర్‌ పెద్దరికం పెరిగి ఉండేది.. వారేమో రారు.. వచ్చిన వాళ్లు ఇలా ఉన్నారు అని వ్యాఖ్యానించారు. గంగుల కమలాకర్‌ ఈ ఒక్క విషయంలోనైనా వాళ్ల ఒత్తిడికి లొంగవద్దని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *