హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 26: వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలోని విఘ్నాలను తొలగించి అందరికీ ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించాలని ముఖ్యమంత్రి విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. వాడవాడలా వెలిసే గణేష్ మండపాలలో భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించుకోవాలని కోరారు. గణపతి నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సంవత్సరం కూడా వినాయకుని మండపాలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నదన్నారు. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో ఏర్పడే సకల విఘ్నాలను తొలగించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వినాయకుడిని ప్రార్థించారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా అందరం మట్టి వినాయకుడిని పూజిద్దామని పిలుపునిచ్చారు. మట్టి వినాయకుడిని పూజించడం పర్యావరణానికి మేలు చేయడమేగాక అది మన సంస్కృతి అని అన్నారు. ప్రతి మండపంలోనూ మట్టి వినాయకులను పెట్టి పూజించి మన సంస్కృతిని, పర్యావరణాన్ని కాపాడుకుందాం అని భట్టి సూచించారు. ఊరూరా వెలసిన వినాయక మండపాలకు ఈ ఏడాది ప్రజా ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది. విమండప నిర్వహకులు అధికారులు సూచించిన భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.




