ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్‌ ‌బరస్ట్

-‌ మెరుపు వరదలతో ఇళ్లు, రోడ్లు ధ్వంసం

డెహ్రాడూన్‌,‌సెప్టెంబర్‌16:ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్‌ ‌బరస్ట్ ‌సంభవించింది. దెహ్రాదూన్‌లో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. సహస్త్రధారలో వరద ధాటికి పలువురు గల్లంతయ్యారు. వరదతో పాటు వచ్చిన బురద,ఇతర శిథిలాల తాకిడికి అనేక ఇళ్లు,దుకాణాలు, హోటళ్లు దెబ్బతిన్నాయి. రహదారుల పైకి భారీగా వరద చేరడంతో వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. రిషికేశ్‌లో చంద్రభాగానది ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తోంది. నదీ ప్రవాహంలో చిక్కుకున్న ముగ్గురిని ఎస్డీఆర్‌ఎఫ్‌ ‌సిబ్బంది రక్షించారు. తమ్సా, టన్స్, ‌సాంగ్‌ ‌నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ ‌బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. డెహ్రూడూన్‌లో సహస్త్రధార ప్రాంతంలో వరదలు సంభవించి రోడ్లు కొట్టుకుపోయాయని రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం మంగళవారం వెల్లడించింది. ఈ వరదల్లో చిక్కుకుపోయిన వారికి ఎస్‌డిఆర్‌ఎఫ్‌ ‌బృందం సహాయక చర్యలు చేపట్టింది. ఇక ఉత్తరాఖండ్‌ ‌జిల్లాలో వరదలు రావడంతో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారని సమాచారం. దేవభూమి ఇనిస్టిట్యూట్‌ ‌విద్యార్థులతో సహా వంద మందికిపైగా ప్రజలను రెస్క్యూ దళం కాపాడింది. వర్షాల వల్ల సహస్త్రధార, మాల్‌ ‌దేవతా, ముస్సోరీ ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లినట్లు విపత్తు నిర్వహణ కార్యదర్శి వినోద్‌ ‌కుమార్‌ ‌సుమన్‌ ‌తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ సిబ్బంది బృందాలుగా ఏర్పడి 300 – 400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.కాగా, ఈ వరదల వల్ల సహస్త్రధార, డెహ్రాడూన్‌లో కొత్త దకాణలు దెబ్బతిన్నాయి. ఈ వార్తవిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ‌ధామి విచారం వ్యక్తం చేశారు. మంగళవారం డెహ్రాడూన్‌లో, సహస్త్రధార ప్రాంతాల్లో పర్యటించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *