జమ్మూకాశ్మీర్‌లో మేఘాల విస్ఫోట‌నం

– కొండచరియలు విరిగిపడి 11మంది మృతి

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 30: జమ్మూ కాశ్మీర్‌లో శనివారం ఉదయం రాంబన్‌లో మేఘాల విస్ఫోటనం సంభవించగా రియాసిలో ఒక ఇంటిపై కొండచరియలు విరిగిపడటంతో ఐదుగురు పిల్లలు సహా 11మంది మరణించారు. రాంబన్‌లోని రాజ్‌గఢ్‌ తహసీల్‌లో మేఘాల విస్ఫోటనం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించిన తరువాత నలుగురు గ్రామస్తులు మరణించగా మరికొందరు గల్లంతైనట్లు అనుమానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వరదలో రెండు ఇళ్లు, ఒక పాఠశాల భవనం కొట్టుకుపోయాయి. రెస్క్యూ, రిలీఫ్‌ బృందాలు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. నలుగురి మృతదేహాలను వెలికితీసినప్పటికీ తప్పిపోయిన ఇతర వ్యక్తుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ఐదుగురు వ్యక్తుల ఆచూకీ తెలియలేదని నివేదికలు వచ్చాయని, తాము వారి కోసం వెతుకుతున్నామని తెలిపారు. ఆకస్మిక వరదలు ఆ ప్రాంతంలో ఆస్తిని కూడా దెబ్బతీశాయి అని ఒక అధికారి తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *