రాష్ట్రంలో వాతావరణ మార్పులు

– మూడో వారంలో పిడుగులతో కూడిన వర్షాలు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: రాష్ట్రంలో ఈ నెల చివరలో అకాల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెదర్‌ ‌మ్యాన్‌ ‌వెల్లడించారు.  18, 19 తర్వాత ఉరుములు మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. అయితే అప్పటివరకు ఎండలు ఇదేస్థాయిలో కొనసాగుతాయని వెదర్‌ ‌మ్యాన్‌ ‌చెప్పారు. ఈస్ట్ ‌తెలంగాణ జిల్లాల్లో ఏకంగా 39 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. హైదరాబాద్‌లో 36 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించారు.

మంగపేటలో అత్యధికంగా 39 డిగ్రీలు నమోదు

తెలంగాణలో భానుడు భగభగమంటున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం ములుగు జిల్లా మంగపేటలో అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌, ‌జగిత్యాల, ఖమ్మంలో 38.9 డిగ్రీలు, మంచిర్యాలలో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని, వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *