మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలి

– సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్‌ ప్రియాంక

హైదరాబాద్‌, ఆగస్టు 26 : పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని సమాచార పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్‌ సిహెచ్‌.ప్రియాంక సూచించారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ సచివాలయం ప్రాంగణంలోని మీడియా సెంటర్‌లో సుమారు 150 మట్టి వినాయక విహ్రాలను జర్నలిస్టు సోదరులకు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణానికి నష్టం జరగకుండా మట్టి వినాయకులనే పూజించాలని, పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ ప్రజలకు వినాయక చవిత సందర్భంగా హార్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు సంచాలకుడు డి.ఎస్‌.జగన్‌, జాయింట్‌ డైరెక్టర్లు కె.వెంకటరమణ, సమాచాం శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *