– భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు
– హాల్ టిక్కెట్ చూపిస్తే ఉచిత బస్సు ప్రయాణం
– సకాలంలో సెంటర్‌కు చేరుకోవాలన్న అధికారులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి
కాగా, ఒత్తిడిని జయించడానికి విద్యార్థులు ఏకాగ్రతతో, ప్రణాళికబద్దంగా చదివితే మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారని నిపుణులు సూచిస్తున్నారు. ఇతర ఆలోచనలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పరీక్షల సమయంలో సెల్‌ఫోన్, టీవీ వైపు మనస్సు మరలకుండా చూసుకోవాలి. ప్రతిరోజూ విద్యార్థి ఏర్పాటు చేసుకున్న టైం టేబుల్ ప్రకారం చదువు కోవాల్సి ఉంటుంది. సందేహాలను విద్యార్థులు ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. అందుకోసం తరగతి ఉపాధ్యాయులు లేదా, మంచి స్నేహితులు, సీనియర్ల ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవాలి. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇంట్లో చక్కటి వాతావరణం కల్పించాలి. విద్యార్థిలో ఆత్మ విశ్వాసం పెంపొందించేందుకు ప్రతిక్షణం కృషి చేయాలి. అవసరమైన ధైర్యం అందివ్వాలి. పిల్లలు ఎక్కువ సమయం చదువుకే కేటాయిస్తారు కనుక వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానుకూలంగా విద్యార్థికి తగిన పౌష్టికాహారం అందించే ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. సమయానికి తగినంత నిద్రపోయేలా కూడా చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేశాం. ఇప్పటికే రెండు ప్రీఫైనల్ పరీక్షలను నిర్వహించి విద్యార్థులకు మనోధైర్యాన్ని కల్పించాం. గణితం, సైన్స్, ఇంగ్లిష్ స్జబెక్ట్‌లలో మంచి మార్కులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





