– పరస్పర నినాదాలతో స్వల్ప ఉద్రిక్తత
– బిఆరఎస్ ఆధిక్యాన్ని దెబ్బతీసిన ఎక్స్ అఫీషియో
– ఎర్రబెల్లిని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యక్తలు
– రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసిన ఎస్పీ
– చైర్మన్ ఎన్నిక వాయిదా.. గత్యంతరం లేకనే అన్న అధికారులు
– వాయిదాపై ఎర్రబెల్లి ఆగ్రహం
మహబూబాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: హంగ్ వచ్చిన పలు మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు ఎత్తులకుపైఎత్తులు వేస్తున్న క్రమంలో ఘర్షణలు, ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. మొత్తం 16 వార్డులు ఉండగా బీఆరఎస్ 9, కాంగ్రెస్ 7 గెలుపొందాయి. కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డిలు ఎక్సఅఫీషియో సభ్యులుగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. దీంతో బీఆరఎస్, కాంగ్రెస్ బలాబలాలు సమానంగా మారాయి. దాంతో డ్రా ద్వారా చైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా ఎన్నిక వాయిదా పడింది. అంతకుముందు బీఆరఎస్, కాంగ్రెస్ శ్రేణులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కార్యాలయానికి చేరుకోగా ఎర్రబెల్లి పీఏపై కొంతమంది కాంగ్రెస్ కార్తకర్తలు దాడి చేశారు. వరంగల్‌లో ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా కావ్య పేరు ఉందని బీఆరఎస్ ఆరోపిస్తూ దీనిపై చట్టపరంగా ముందుకెళ్తామని చెబుతోంది. బీఆరఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తొర్రూరులో ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాగా అధికారులు అడ్డుకుని రాజ్యసభ సభ్యులు తమకు ఓటు ఉన్న ప్రాంతంలోనే ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. ఆయనను ఎక్స్ అఫిషియో సభ్యుడిగా అనుమతించ లేదు. దాంతో ఆయన ఈ అంశంపై కోర్టుకు వెళ్తానని చెప్పారు. బీఆరఎస్ భారీ జనసకరణకు ప్లాన్ చేయడంతో మున్సిపల్ ఆఫీసు దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇరు వర్గాలు ఒకరికొకరు వ్యతిరేక నినాదాలు చేసుకుంటూ పోలీసులను సైతం తోసుకుంటూ మున్సిపల్ ఆఫీసు లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పరిస్థితి అదుపు తప్పగా జిల్లా ఎస్సీ శబరీష్ అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఎవరూ అక్కడ ఉండకూడదంటూ పంపించేశారు. అక్కడే ఉంటే లాఠీఛార్జి చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే అక్కడికి వచ్చిన యశశ్వినిరెడ్డి అత్త ఝాన్సీరెడ్డిని కూడా ఎస్పీ వెకిక్కి పంపారు. ఆమె కారు దిగకుండానే వెళ్లిపోయారు. ఎర్రబెల్లి దయాకర్ రావుని మాత్రం మున్సిపల్ ఆఫీసులోకి అనుమతించారు.
అడ్డుకున్న కాంగ్రెస్.. చైర్మన్ ఎన్నిక వాయిదా
కాంగ్రెస్ సభ్యులు అకారణంగా గొడవ చేయడంతో చైర్మన్ ఎన్నిక వాయిదా అనివార్యమైంది. మంగళవారం ఎన్నిక నిర్వహిస్తున్నట్టు ఎన్నికల అధికారి, తొర్రూరు ఆర్డీవో తెలిపారు. ఎన్నికల్లో బీఆరఎస్‌కు 9, కాంగ్రెస్‌కు ఏడుగురు సభ్యులు ఉండాగా ఇరువర్గాలు క్యాంపునకు తీసుకువెళ్లాయి. ఈరోజు చైర్మన్ ఎన్నిక నిర్వహించవలసి ఉండగా ఎవరికి వారుగా క్యాంపు నుండి ఎన్నికల సమావేశ మందిరానికి నేరుగా వచ్చారు. కడియం కావ్య వచ్చేముందు ఆమెకు ఓటు హక్కు ఇలా ఇస్తారని బీఆరఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎక్స్ అఫీషియో మెంబర్లుగా స్థానిక శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి, ఎంపీ కావ్య తమ ఓటు హక్కు కోసం ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేసుకోగా వారికి తొర్రూరు మున్సిపాలిటీలో ఓటు వేసే అవకాశం కల్పించారు. గతంలో వరంగల్ జీహెచఎంసీలో ం కావ్య ఓటు వేసిందని, మళ్లీ ఎలా ఇస్తారని అధికారులకు బీఆరఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. అయినా వారికి ఓటు హక్కు ఇస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలపడంతో వారు ఓటు వేయడానికి మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. దీంతో కడియం గో బ్యాక్ అని బీఆరఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత 12.30 గంటల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభించగా ఓటు వేయడానికి వచ్చే కావ్యను ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని సభ్యులు డిమాండ్ చేశారు. అంతేకాÅ£ నాలుగో వార్డు కౌన్సిలర్ జంప ఎన్నిక చెల్లదంటూ ఎన్నికల అధికారిని నిలదీశారు. ఈ రెండింటిపై తమకు క్లారిటీ ఇస్తేనే ఎన్నికల్లో పాల్గొంటామని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. దీంతో ఎన్నికల అధికారులు తల పట్టుకున్నారు. ఉన్నతాధికారులను సంప్రదించి ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కోరం పూర్తిగా ఉన్నది.. ఎన్నికలు నిర్వహించాలని అధికారులను అడగగా ఎన్నికలు జరగనివ్వడం లేదు కాబట్టి వాయిదా వేస్తున్నామని వారు తెలిపారు. నాలుగో వార్డు కౌన్సిలర్ జంపకు బ్రాందీ షాపు లైసెన్స్ ఉన్నది కాబట్టి ఆయన ఎన్నిక చెల్లదని సభ్యులు పట్టుపట్టారు ఇది తమ పరిధిలో లేదని నామినేషన్ స్క్రూటినీలోనే ఫిర్యాదు చేయవలసి ఉన్నదని ఎన్నికల అధికారి బదులిచ్చారు. ఎన్నిక వాయిదా పడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
కోరం ఉన్నా వాయిదా దుర్మార్గం : మండిపడ్డ ఎర్రబెల్లి
చైర్మన్ ఎన్నిక వాయిదాపై ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఎన్నికను వాయిదా వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విమర్శించారు. పరిస్థితులు సజావుగా ఉన్నప్పటికీ ఎన్నికను వాయిదా వేయడం దుర్మార్గమన్నారు. ప్రజల తీర్పును గౌరవించకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ వైఖరిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్‌ను సంప్రదించేందుకు ఫోన్ చేసినా స్పందించలేదని ఎర్రబెల్లి ఆరోపించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



