సివిల్స్ ‌ఫలితాలు విడుదల

– సత్తా  చాటిన తెలుగు అభ్యర్థులు
– అనూజ్‌ అగ్నిహోత్రికి ఆల్‌ ఇం‌డియా ఫస్ట్ ‌ర్యాంక్‌

‌న్యూదిల్లీ,మార్చి6: సివిల్స్ ‌పరీక్ష ఫలితాలను యూనియన్‌ ‌పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌శుక్రవారం విడుదల చేసింది. ఈ పరీక్షల్లో అనూజ్‌ అగ్నిహోత్రి ఆల్‌ ఇం‌డియా ఫస్ట్ ‌ర్యాంక్‌ ‌సాధించారు. రాజేశ్వరి సువే రెండో స్థానంలో నిలిచారు. ఆకాన్ష్ ‌ధుల్‌ ‌మూడో ర్యాంక్‌, రాఘవ్‌ ‌ఝున్‌ఝున్‌ ‌వాలా నాలుగో ర్యాంక్‌ ‌సాధించారు. ఈ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థులు సత్తా చాటారు. సృజన (55వ ర్యాంక్‌), ‌డీఎస్‌కే ప్రచేత్‌ (193‌), ఎస్‌.వర్షిత్‌రెడ్డి (259), ఎం.‌పవన్‌కుమార్‌రెడ్డి (297), ‌వి. విక్రమసింహారెడ్డి (541), ‌గుమ్మల శ్వేత (573), ‌పోతుపురెడ్డి భార్గవ్‌ (537‌), ‌పుడారి రాహుల్‌ (748‌), ‌కత్తిమాని అనిరుధ్‌ (786‌), ‌కోరపాతుల శ్రీకర్‌రాజు (806), ఇస్లావత్‌ శ్రీ‌రామ్‌ ‌హర్ష (823), ‌కట్టా ప్రత్యూష (908), ‌గోగుల రాజశేఖర్‌ (920‌), ‌గుగులోతు జితేందర్‌ ‌నాయక్‌ (939‌) ‌సాధించారు. ఫలితాలు విడుదలైన 15 రోజుల్లో వెబ్‌సైట్‌లో మార్కులు అప్‌ ‌లోడ్‌ ‌చేస్తామని యూపీఎస్సీ ప్రకటించింది. మరిన్ని వివరాలు కోసం ఈ ఫోన్‌ ‌నెంబర్లు.. 23385271, 23381125, 23098543 సంప్రదించాలని ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సూచించింది. ఉదయం 10 నుంచి 5 గంటల మధ్య సంప్రదించాలని యూపీఎస్సీ స్పష్టం చేసింది. గతేడాది అంటే 2025లో ప్రిలిమ్స్ ‌పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ఆగస్ట్, ‌సెప్టెంబర్‌లో మెయిన్స్ ‌పరీక్షలు చేపట్టారు. వాటిలో అర్హత పొందిన వారికి ఈ ఏడాది ఫిబ్రవరిలో మౌఖిక పరీక్ష నిర్వహించారు. ఈ చివరి వడపోతలో మొత్తం 1087 మంది అభ్యర్థులు సివిల్స్ ‌పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐపీఎస్‌తోపాటు గ్రూప్‌-ఎ, ‌గ్రూప్‌ -బిలో వివిధ సెంట్రల్‌ ‌సర్వీస్‌లో వీరంతా చేరనున్నారు.

మెరిసిన ఉమ్మడి వరంగల్‌ ‌యువత

వరంగల్‌ :  కష్టపడితే ఏదైనా సాధించవచ్చని ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా యువకులు నిరూపించారు. దేశంలోనే అత్యున్నత సర్వీస్‌ అయిన యూపీఎస్సీ ఫలితాల్లో ర్యాంకులు పొందారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి పుట్టెడు దుఃఖాన్నిగుండెల్లో దాచుకొని నానమ్మ పారిశుద్ధ్య కష్టాన్ని కండ్లారా చూసి ఎదిగిన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలానికి చెందిన దైనంపల్లి ప్రవీణ్‌  ‌తన కృషి, పట్టుదలతో సివిల్స్ ‌ఫలితాల్లో 793వ ర్యాంక్‌ ‌సాధించి ములుగు జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. గ్రూప్‌-1 ‌పరీక్షల్లో 105వ ర్యాంక్‌ ‌సాధించి డీఎస్పీగా ఎంపికైన ప్రవీణ్‌, ‌డీఎస్పీ శిక్షణ పొందుతూనే తాజాగా విడుదలైన యూపీఎస్సీలో ర్యాంక్‌ను సాధించి అందరికి ఆదర్శంగా నిలిచాడు. హనుమకొండ జిల్లా న్యూశాయంపేటకు చెందిన గుండు అఖిలేష్‌ ఆల్‌ ఇం‌డియా సర్వీస్‌ ఐపీఎస్‌ 464 ‌ర్యాంకును సాధించి ప్రతిభను చాటాడు. అఖిలేష్‌ ‌తండ్రి భూపాలపల్లిలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌ ‌విధులు నిర్వహిస్తున్నారు. తల్లి సరస్వతి గృహిణిగా ఇంటి బాధ్యతలను నిర్వహిస్తోంది.అఖిలేష్‌ 2013‌లో హనుమకొండ హంటర్‌ ‌రోడ్డులోని వరంగల్‌ ‌పబ్లిక్‌ ‌స్కూల్లో పదో తరగతిలో ఉత్తమ ర్యాంకును సాధించాడు.అఖిలేష్‌ ‌యూపీఎస్సీలో విజయం సాధించడం పట్ల తల్లిండ్రులు, స్థానికులు హర్షం వెలిబుచ్చారు. కాజీపేట పట్టణం 61 వ డివిజన్‌ ‌ప్రశాంత్‌ ‌నగర్‌ ‌ఫేస్‌ 3‌లో నివాసం ఉంటున్న అట్లా తరుణ్‌ ‌తేజ యూనియన్‌ ‌పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌ఫలితాలలో 123వ ర్యాంకుతో సత్తా చాటారు. కుమారుడు సివిల్‌ ‌సర్వీస్‌లో మెరుగైన ర్యాంక్‌ ‌సాధించడం పట్ల తల్లిదండ్రులు అట్ల రవీందర్‌- అమరావతి సంతోషం వ్యక్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *