యువతకు సివిల్ డిఫెన్స్ వలంటీర్ శిక్షణ

– ప్రారంభించిన ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ నారాయణరావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ, సివిల్ డిఫెన్స్ శాఖ యువతను అత్యవసర సేవలకుచేరుకునే ముందు ప్రథమ స్పందనకారులుగా (ఫస్ట్ రెస్పాండర్స్) తయారు చేయడానికి సివిల్ డిఫెన్స్ వలంటీర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. వారం రోజులపాటు సాగే ఈ శిక్షణ 15వ తేదీ వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ పీజీ కాలేజ్, సైఫాబాద్‌లో ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జి.వి.నారాయణరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శిక్షణ అన్ని శాఖలకు ఎంతో ఉపయోగకరమన్నారు. అత్యవసర పరిస్థితులు, ముఖ్యంగా ఎయిర్ రైడ్స్, రసాయన దాడులు, న్యూక్లియర్ ప్రమాదాలు, ఇతర విపత్తుల సమయంలో శిక్షణ పొందిన వలంటీర్లు ప్రభుత్వ శాఖలకు సహకరిస్తారని చెప్పారు. రక్షణ చర్యలు (రెస్క్యూ ఆపరేషన్స్), అగ్నిమాపక చర్యలు (ఫైర్ ఫైటింగ్), ప్రథమ చికిత్స, గుంపు నియంత్రణ (క్రౌడ్ కంట్రోల్), సహాయక సామగ్రి పంపిణీ వంటి అంశాలలో వలంటీర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వలంటీర్లు పోలీస్, ఫైర్ సర్వీసెస్, ఎన్‌డీఆర్ఎఫ్, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని పనిచేస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ, సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ అధికారులకు సూచించారు. శిక్షణ పొందిన వలంటీర్లతో బలమైన కమ్యూనిటీ ఏర్పడడం అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎఫ్ఓ ఎమ్‌జడ్-1 బి.సుధాకర్ రావు, ప్రిన్సిపాల్ డి.కరుణ సాగర్, వైస్ ప్రిన్సిపాల్ ఈ.రామా, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *