– అల్లు సినిమాస్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12 : హైదరాబాద్‌లో నిర్వహించిన అల్లు సినిమాస్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొని తెలుగు సినిమా పరిశ్రమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా దేశానికి గొప్ప పేరు తీసుకువచ్చే శక్తివంతమైన మాధ్యమమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సినిమా రంగానికి విశేష సేవలు అందిస్తున్న అల్లు కుటుంబాన్ని అభినందించారు. తాను చిన్నప్పటి నుంచే సినిమా అభిమానినని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సినిమాను చూడటానికి లారీ ఎక్కి వనపర్తి వరకు వెళ్లేవాడినని ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రముఖ నటుడు కృష్ణ తనకు ఎంతో ఇష్టమైన నటుడని, ఆయన ఏడాదికి 15 సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించేవారని తెలిపారు.
సాంకేతికంగా తెలుగు సినిమా ముందంజ
ప్రస్తుతం తెలుగు సినిమా సాంకేతికంగా ఎంతో వేగంగా ముందుకు సాగుతోందని సీఎం అన్నారు. ప్రేక్షకులను కట్టిపడేసే గొప్ప సినిమాలు వస్తున్నాయని పేర్కొన్నారు.బాహుబలి, కల్కీ 2898 ఏడీ, అరుంధతి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు పేరు తెచ్చాయని చెప్పారు. తెలుగు సినిమా పరిశ్రమను హైదరాబాద్‌కు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తులు ఎన్‌టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు అని సీఎం గుర్తు చేశారు. వారి కృషి వల్లే హైదరాబాద్ తెలుగు సినిమా కేంద్రంగా మారిందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



