– తెలంగాణ రైజింగ్‌పై చిరు, నాగ్‌లతో చర్చ
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు 6: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో సినీ నటులు చిరంజీవి, నాగార్జునలతోపాటు పలువురు ప్రముఖులు శనివారం ప్రజాభవన్‌లో సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని వారిని భట్టి విక్రమార్క ఆహ్వానించారు. తప్పకుండా వస్తామని చిరంజీవి, నాగార్జున చెప్పినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌లో సినీ రంగంపై ప్రత్యేక చర్చ జరగనుంది. సినీ రంగంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో తెలంగాణను మొదటి స్థానంలో నిలపాలన్న లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం.. ఈ నెల 9న జరిగే సదస్సులో ’వన్ కంట్రీ – మెనీ సినిమాస్’ పేరుతో ప్యానల్ డిస్కషన్స్ చేయాలని నిర్ణయించింది. ఈ చర్చలో ప్రముఖ దర్శకుడు సుకుమార్‌తో పాటు బాలీవుడ్ నటీనటులు జెనీలియా, రితేశ్ దేశ్‌ముఖ్ దంపతులు, అర్జున్ కపూర్, అనిరుధ్ రాయ్, పార్వతీ గోయెల్, అసిఫ్ అలీ, ప్రియదర్శన్‌లు పాల్గొంటారు. పలువురు నిర్మాతలు, దర్శకులు, ఓటీటీ సంస్థల ప్రతినిధులు, ఇతర సినీ ప్రముఖులు హాజరై తమ అనుభవాలను, అభిప్రాయాలను పంచుకుంటారు. ఫిల్మ్ ఇన్ తెలంగాణ పేరుతో సినిమాల నిర్మాణం, చిత్రీకరణ లొకేషన్లు సహా సదుపాయల కల్పనపై చర్చించనున్నారు. అనంతరం భట్టి విక్రమార్క డియాతో మాట్లాడారు. తెలంగాణ రైసింగ్ సమ్మిట్ అనేది ఒక ఎకానిమిక్ సమ్మిట్ అని వివరించారు. ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైసింగ్ సమ్మిట్ నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ అంత కలిసి కూర్చొని విజన్ డాక్యుమెంట్ రూపొందించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాన్ని సాధించడానికి ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని వెల్లడించారు. ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 1:30 నిమిషాలకు తెలంగాణ రైసింగ్ సమ్మిట్ ప్రారంభమవుతుందని తెలిపారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పుకొచ్చారు. తెలంగాణ రైసింగ్ సమ్మిట్‌లో వివిధ దేశాల నుంచి వచ్చే ప్రముఖ ఎకానమిస్ట్‌లు ప్రసంగిస్తారని తెలిపారు.అలాగే తనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగాలు ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం అనేక ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సెషన్స్ ఉంటాయని వివరించారు. ఆయా డిపార్ట్‌మెంట్‌లకు సంబంధించిన కార్యక్రమాలను మంత్రులు చూసుకుంటారని చెప్పుకొచ్చారు. తెలంగాణ రైసింగ్ సమ్మిట్‌లో అనేక మంది ఎక్స్‌పర్టస్ పాల్గొంటారని వివరించారు. 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు క్లోజింగ్ సెర్మనీ ఉంటుందని తెలిపారు. ఈ సెర్మనీలో ఎవరెవరు పాల్గొంటారనే విషయాన్ని ఓ ప్రకటన ద్వారా మళ్లీ తెలియచేస్తామని తెలిపారు. ఈ గ్లోబల్ సమ్మిట్‌కు 44 దేశాల నుంచి 154 డెలిగేట్స్ వస్తున్నారని వివరించారు. అమెరికా నుంచే 46మంది ప్రముఖులు హాజరవుతారని వెల్లడించారు. తెలంగాణ రైసింగ్ సమ్మిట్‌కు తెలుగు రాష్టాల్లోని అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. స్వయంగా అధికారులు వెళ్లి అధికారికంగా ఆహ్వానిస్తారని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



