– వందవ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: ప్రముఖ విద్యావేత్త, ఐఐటీ రామయ్య వందవ ఏట అడుగుపెట్టిన సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు ఆయనను కలిసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ సమాజంలో పార్టీలకతీతంగా, రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ గౌరవించే వ్యక్తి రామయ్య అని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వారంటే తెలియని వారు లేరని, ఈ దేశానికి, విద్యారంగానికి వారు అందించిన సేవలు వెలగట్ట లేనివని అన్నారు. సమాజానికి ఎంతోమంది ఇంజనీర్లను అందించిన వ్యక్తి ఐఐటీ రామయ్య..ఐఐటీ అంటే రామయ్య.. రామయ్య అంటే ఐఐటీ అనేంత పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. ఆయన ఎప్పుడూ పదవుల కోసమో, డబ్బు కోసమో పాకులాడలేదని, సమాజ సేవ కోసం, సమాజ హితం కోసం, ప్రజాసేవకు వారి జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడుని పేర్కొన్నారు. సిద్దిపేట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసినప్పటి నుండి ఆయనతో తనకు అనుబంధం ఉందని హరీష్‌రావు తెలిపారు. తన జీవితమంతా ఎంతో విలువలతో గడిపారంటూ మరోసారి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





