బాలల హక్కులను కాపాడాలి

– బాలలకు నాణ్యమైన విద్య అందించాలి
– సర్పంచ్ లు విద్యా సంస్థల సిబ్బందితో సమీక్షలు జరపాలి
– డ్రాపౌట్లను నిరోధించాలి
– పిల్లలంతా బడికి వెళ్లేలా చూడాలి
– బాలల హక్కుల పరిరక్షణ వేదిక జాతీయ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: గ్రామీ ణ ప్రాంతాల్లోని బాలల హక్కులను కాపాడిన ప్పుడే ప్రజాస్వామీకరణ వైపు అడుగులు పడతాయని గుర్తించాలని అఖిల భారత బాలల హక్కుల పరిరక్షణ వేదిక జాతీయ అద్యక్షులు ఆర్ వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజ్యాంగంలో 18 సంవత్స రాలలోపు వయసు బాలలకు కల్పించిన హక్కులను కాపాడడం గ్రామ పంచాయతీల కర్తవ్యంగా గుర్తించాలన్నారు. సర్పంచ్ పదవులకు పోటీపడుతున్న వారు ప్రచారంలో బాలల హక్కులను కాపాడతామని హామీ ఇవ్వాలని కోరారు. పౌరులందరు ఆరోగ్యంగా ఉండడం, ఆకలి లేని కుటుంబం, పౌస్టికాహార లోపం లేని పిల్లలు, బాల్య వివాహాలు జరగకుండా చూడడం, బాల కార్మికులు లేకుండా చూడడం, బాలందరికీ నాణ్యమైన విద్యను అందించడం మొదలైన అంశాలన్నీ దీర్ఘకాలిక అభివృద్ధికి సూచికలని, ముందు తరాలు గౌరవప్రదమైన జీవనం గడపడానికి ఇవి తోడ్ప డుతాయన్నారు. ఈ నేపధ్యంలోనే సర్పంచ్ లు తమ గ్రామంలోని బాలలకు సంబంధించిన సంస్థల (పాఠశాలలు, అంగన్వాడి, ఆరోగ్య ఉప కేంద్రాలు) సిబ్బందితోసమీక్షా సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశాలలో వచ్చిన సమస్యలు జాబితా చేసుకొని వాటిప రిష్కారం కోసం ప్రయత్నించాలి. బాలకార్మికులను, బడి మానివేసిన పిల్లలను, ఐదు రోజుల కంటే ఎక్కువ రోజులు బడికి వెళ్లని పిల్ల లజాబితాలు తయారు చేసి పిల్లలందరూ బడికి వెళ్ళేటట్లు ప్రణాళికలు రూపొందించాలని కోరారు. బాలకార్మిక రహిత పంచాయతిగా తీర్చిదిద్దాలి. పాఠశాల స్థాయిలో చేసిన పిల్లలస్థాయి నిర్ధారణ (బేస్ లైన్ సర్వే) పై సమీక్ష చేసి కనీస సామర్ధ్యాలు లేని పిల్లలందరికీ ఉపా ధ్యాయులతో ఒక ప్రణాళికను సిద్దం చేయాలి. గ్రామంలోని పిల్లలందరూ తరగతివారి సామర్ధ్యాలను అందుకునేలా చూడాలి. అర్హులైన పిల్లలందరికి వ్యాధి నిరోధక టీకాలు, అనుబంధ పోషకాహారం అందేందుకు చర్యలు తీసుకోవాలి. పోషకాహార రహిత బాలల గ్రామంగా తీర్చిదిద్దాలి. బాలలందరికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. ఆరోగ్య సేవలు అవసరమున్న బాలలకు ఆరోగ్య సేవలను అందించాలి. ఆరోగ్యకరమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలి. బాలికలు బాల్యవి వాహాలకులోను కాకుండా ప్రతి బాలిక ఉన్నత చదువులు కొనసాగించేలా ప్రణాళికలువేయాలి. అంగన్వాడీ కేంద్రాల సహకారంతో కిశోర బాలికల సంఘాలను పటిష్టం చేయాలి. బాల్య వివాహల రహిత గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలి. ఎస్సీ, ఎస్టీల‌, మైనారిటీ వర్గాల, వికలాంగుల, పేద వర్గాల, ట్రాన్సజెండర్ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సామాజిక న్యాయం అందించడంలో పంచాయతీ ముందు నిలవాలి. పిల్లల రక్షణ కోసం పొందుపరిచిన రాజ్యాంగ హక్కుల గురించి పునశ్చరణ చేసుకోవాలి. బాలలకు పోషకాహార భద్రత, గౌరవం, ఆనందంతో నిండిన బాల్యం అందించడం రాజీ లేని అంశం. కావున గ్రామ పంచాయతీ జవాబుదారీతనంతో నమ్మకమైన స్థలంగా మారాలి. బాల్యానికి భరోసానివ్వాలని విజ్ఞప్తి చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *