– హాస్టల్ భద్రతా ప్రమాణాలపై ఆకస్మిక తనిఖీ
– విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : నగరంలోని బాగ్ లింగంపల్లి మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టల్‌లో ఇటీవల జరిగిన ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా స్పందించింది. కమిషన్ సభ్యురాలు వందనా గౌడ్ ఆదివారం ఈ ఘటనపై పూర్తి దృష్టి సారించారు. ఆమె హైదరాబాద్ జిల్లా బాలల సంరక్షణ అధికారి శ్రీనివాస్‌తో కలిసి ముందుగా కింగ్ కోఠి దవాఖానకు వెళ్లి చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. వైద్యుల నుండి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ధృవీకరించగా, వారికి మెరుగైన వైద్యం అందించాలని కమిషన్ సిబ్బందికి సూచించింది.
హాస్టల్‌లో ఆకస్మిక తనిఖీ
తరువాత, అధికారుల బృందం హాస్టల్ ప్రాంగణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసింది. వందనా గౌడ్ నేతృత్వంలోని బృందం ముఖ్యంగా ఆహార నాణ్యత, వంటగది నిర్వహణ, పారిశుధ్యం, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలపై దృష్టి సారించారు. విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడిన కమిషన్ సభ్యురాలు వందనా గౌడ్ఆ హార నాణ్యత ప్రమాణాల్లో ఏమాత్రం రాజీ పడవద్దని యాజమాన్యాన్ని హెచ్చరించారు. పిల్లల భద్రత విషయంలో కమిషన్ చాలా సీరియస్‌గా ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే యాజమాన్యంపై కఠిన చర్యలు తప్పవు. యాజమాన్యం అన్ని విధానాలను కచ్చితంగా పాటించాలి అని స్పష్టం చేశారు. మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టల్స్‌లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు సంబంధించి యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని ఈ సందర్భంగా కమిషన్ మరోసారి ఉద్ఘాటించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





