– 200 మంది చనిపోయినట్లు యూనిసెఫ్ ప్రకటన
న్యూదిల్లీ, మార్చి 6 : అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. యుద్ధం కారణంగా ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వారిలో చిన్నారులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. యుద్ధం మొదలైన నాటినుంచి దాదాపు 200 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని యునిసెఫ్ తాజాగా వెల్లడించింది. ఇందులో అత్యధికంగా ఇరాన్‌లో 181మంది మరణించినట్లు వెల్లడించింది. లెబనాన్‌లో (7), ఇజ్రాయెల్ (3), కువైట్(1)లో మృతిచెందినట్లు తెలిపింది. యుద్దాలు పిల్లలు ప్రారంభించరు.. కానీ, మూల్యం మాత్రం చెల్లిస్తున్నారు అని వ్యాఖ్యానించింది. పశ్చిమాసియాలో సైనిక ఉద్రిక్తతలు ఇప్పటికే చిన్నారులపై ఆందోళనకర ప్రభావాన్ని చూపిందని పేర్కొంది. ఇదిలాఉండగా, అమెరికా-ఇజ్రాయెల్ తొలిరోజు ఆపరేషన్‌లో ఇరాన్‌లోని మినాబ్‌లో ఉన్న ఓ బాలికల పాఠశాలపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 160మందికి పైగా విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయారని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ తెలిపింది. ఈ దాడిపై తాజాగా యూఎస్ దళాలు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు యూఎస్ అధికారులు పేర్కొన్నట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





