పరిశుభ్రత పాటించ‌ని ‘మ‌న ట్ర‌స్ట్‌’

– చైల్డ్ రైట్స్ క‌మిష‌న్ త‌నిఖీలో వెల్లడి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 30: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మధ్యాహ్న భోజనం సరఫరా చేసే ఉప్పలన రామంతాపూరనలో ఉన్న ‘మన ట్రస్ట్‌’ను చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ చైరనపర్సనన సీతాదయాకరనరెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. ఈ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 970కు పైగా ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్నారు . కమిషన్‌ ప్రధానంగా ఆహారం తయారీ, వంట గది, దాని పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అన్నదానిపై తనిఖీ చేసింది. రికార్డులు ప్రతిరోజూ నిర్వహిస్తున్నారా లేదా అన్న అంశం కూడా పరిశీలించింది. మిగిలిపోయిన ఆహారం నిర్వహణ ఎలా జరుగుతోంది, పెస్ట్‌ కంట్రోల్‌ ఎన్ని రోజులకోసారి జరుగుతుందో, ఆహారం రవాణా ఎలా జరుగుతుందో, ఆహారం ఉంచే పాత్రల శుభ్రత ఏమిటి అనే అంశాలను కూడా తనిఖీ చేసింది. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు అడిగి తెలుసుకున్నది. ఆహారం ఉండే ప్రదేశాలు, ఆహారాన్ని వాహనాల్లో ఎక్కించేటప్పుడు వ్యక్తిగత శుభ్రత పాటిస్తున్నారా లేదా అన్న అంశం, సరకుల నిల్వ చేసే గోదాములు శుభ్రంగా ఉన్నాయా లేదా, సరకుల క్వాలిటీ పరిశీలన తనిఖీ చేసింది. పూర్తిగా పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారం ఉండడం లేదని, రికార్డులు సరిగా నిర్వహించడం లేదని, మైనర్‌ బాలలను పనికి నియమించుకున్నారని కమిషనన తనిఖీలో తేలింది. దీనిపై సంబంధిత అధికారులను పిలిచి మాట్లాడతామని కమిషన్‌ తెలియజేసింది. కార్యక్రమంలో కమిషన్‌ సభ్యులు వచన్‌ కుమార్‌, వందన గౌడ్‌, చందన, అపర్ణ, సరిత, ప్రేమలత అగర్వాల్‌ పాల్గొన్నారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *