సాయితేజ్‌కు చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ పరామర్శ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 10: సినిమా బెనిఫిట్‌ షోలో గాయపడి సికింద్రాబాద్‌లోని ఏషియన్‌ ట్రాన్స్‌కేర్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్న సాయితేజ్‌ను చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ పరామర్శించింది. అతని ఆరోగ్య పరిస్థితి, వైద్య చికిత్స వివరాలు, అతని కుటుంబ ఆర్థిక వనరుల వెసులుబాటు తదితర అంశాలను బాలుడి కుటుంబ సభ్యులు, వైద్యులతో చర్చించింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ను సంప్రదించాలని బాలుడి కుటుంబ సభ్యులకు సూచించింది. అలాగే బాలుడి చికిత్సకయ్యే ఖర్చు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా అందించే ఆలోచన చేస్తామని, అదేవిధంగా బాలుడి అక్కకు ఆర్థిక వెసులుబాటులో భాగంగా కమిషన్‌ నుంచి పెన్షన్‌ వంటివి ఇప్పించే ఆలోచన చేస్తామని కమిషన్‌ సభ్యులు హామీ ఇచ్చారు. చికిత్స విషయంలో ఆ చిత్రం యూనిట్‌ సభ్యులు స్పందించకపోతే కమిటీకి తెలియజేయాలన్నారు. బాలుడిని పరామర్శించిన వారిలో తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు వచన్‌ కుమార్‌, అపర్ణ, వందన, ప్రేమలత అగర్వాల్‌ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *