చికిత సంకల్పం యువతకు స్ఫూర్తిదాయకం

– ఆర్చరీ వరల్డ్‌ చాంపియన్‌ సాధించడంపై సీఎం అభినందనలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 26: ప్రపంచ యూత్‌ ఆర్చరీలో స్వర్ణ పతకం సాధించి వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్‌ గ్రామానికి చెందిన చికిత తానిపర్తికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌’ వేదికగా అభినందనలు తెలిపారు. ఆర్చరీ అండర్‌ 21 కేటగిరీలో కెనడాలో శనివారం జరిగిన ఫైనల్స్‌లో కొరియాకు చెందిన పార్క్‌ యెరిన్‌పై విజయం సాధించి స్వర్ణం చేజిక్కించుకోవడం దేశానికే గర్వకారణమని అన్నారు. ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, లక్ష్యాన్ని సాధించాలన్న చికిత సంకల్పం యువతీయువకులకు స్ఫూర్తిదాయమని అన్నారు. ఆటుపోట్లను తట్టుకుంటూ గ్రామీణ ప్రాంతం నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆర్చరీలో రాణించిన చికిత భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. చిన్ననాటి నుంచి చికితలోని ప్రతిభను గుర్తించి అందుకనుగుణంగా ప్రోత్సహించిన తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలిపారు.

ఉప ముఖ్యమంత్రి అభినందనలు

ప్రపంచ ఆర్చరీ యూత్‌ చాంపియన్‌షిప్‌లో ఇండియా తరపున చరిత్ర సృష్టించిన చికితను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేకంగా అభినందించారు. ఆమె స్వర్ణ పతకం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విశ్వ వేదికలపై దేశ పతాకాన్ని రెపరెపలాడిస్తున్న తెలంగాణ బిడ్డ చికత మరిన్ని ఘన విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. కెనడాలోని విన్నిపెగ్‌లో జరిగిన టోర్నమెంట్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చికిత నిలిచింది. 20 ఏళ్ల ఈ యువ ఆర్చర్‌ టోర్నమెంట్‌ అంతటా అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించింది.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *