కెసిఆర్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ఫాలో : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు
కెసిఆర్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నేతృత్వం లో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుంది అని పేర్కొంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో గత ఐదు రోజులుగా నిరాహార దీక్ష నిర్వహిస్తున్న సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు రెండు ప్రధాన అంశాలను లేవనెత్తారు అని ప్రస్తావిస్తూ 1. జీఓ నెం.49: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వుగా ప్రకటించడం: దీనితో 339 గ్రామాలలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడి ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతాయి. హౌసింగ్ డిపార్ట్మెంట్ శాంక్షన్ చేసిన ఇందిరమ్మ ఇళ్లను కూడా ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారంటే ఒక శాఖకు ఇంకో శాఖకు మధ్య సమన్వయం లేదని తెలుస్తోంది. ఇప్పటికే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దాదాపు 100 గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. ఈ జీఓ రాష్ట్ర ప్రభుత్వం మే 30వ తేదీ జారీ చేసింది . ఆదివాసీ సంఘాలు, ప్రతిపక్షాలు దశల వారీ ఆందోళనలు చేపట్టాయి. కలక్టరేట్ ని ముట్టడించాయి. జీ ఓ ను రద్దు చేయాలని మా శాసనసభ్యులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా ప్రభుత్వం నుండి స్పందన కరువైంది. 2. పోడు భూముల సాగు కోసం సహకరిస్తాము అని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఎస్సీ,ఎస్టీ, బీసీలు తరతరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల విషయంలో రైతులెవరిని ఇబ్బంది పెట్టమని హామీ ఇచ్చింది. ఇప్పుడేమో కెసిఆర్ సాగించిన నిర్బంధకాండ కొనసాగిస్తుంది. ఉత్తర తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో పోడు భూములను అటవీ అధికారులు స్వాధీనం చేసుకొని రైతులకు జీవనోపాధి లేకుండా చేస్తున్నారు. ఐదో రోజుకు చేరిన నిరాహార దీక్ష వలన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఆరోగ్యం క్షీణించి షుగర్ లెవెల్స్ 69కి పడిపోయాయి. Serum Bilirubin స్థాయి మరియు Serum Uric acid స్థాయి పెరగడంతో చాలా నిరసించి పోయారు. ప్రభుత్వ వైద్యులు కూడా ఇదే విషయాన్ని నిర్ధారించారు. వెంటనే ప్రభుత్వం దిగివచ్చి ఈ జీఓ నెంబర్ 49 రద్దు చేయాలి మరియు ఉత్తర తెలంగాణలో ఉన్న పోడు రైతులను ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అని ప్రకటనలో పేర్కొన్నారు.





