చికెన్ బంద్ తో దిగివచ్చిన పౌల్ట్రీలు

– డిమాండ్లు అంగీకరించినట్లు ట్రేడర్స్ వెల్లడి

వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: చికెన్ సెం టర్ల బంద్ దెబ్బకు పౌల్ట్రీ కంపెనీలు దిగివ చ్చాయి. బర్ట్ ధరను రూ.185 నుంచి రూ. 125కి తగ్గించాయి. చికెన్ సెంటర్ల నిర్వాహ కులకు ఇచ్చే మార్జిన్ను గతంలో మాదిరిగా నే కిలోకు రూ.15, ఆపైన ఇచ్చేందుకు ముం దుకొచ్చాయి. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా లోని చికెన్ సెంటర్ల నిర్వాహకులు బంద్ను విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఉ మ్మడి వరంగల్ జిల్లా బ్రాయిలర్ ట్రేడర్స్ అసోసియేషన్ నేతలు తెలిపారు. బంద్ను
విజయవంతం చేసినందుకు చికెన్ సెంటర్ల నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఒక్కరోజు చికెన్ సెంటర్ల బంద్ నాటు కోళ్లకు డిమాండ్ పెరిగింది. బ్రాయిలర్ కోళ్ల అమ్మకాలు లేకపోవడంతో మాంసం ప్రియు లు నాటు కోళ్లను ఎక్కువగా కొనుగోలు చే శారు. నాటు కోడి రేటు సాధారణంగా ఎక్కు వగానే ఉంటుంది కనుక మామూలు రోజు ల్లో వీటి అమ్మకాలు తక్కువ. బంద్ నాటు కోళ్ల పెంపకందారులు వీటిని మార్కెట్కు తరలించగా సాధారణ ధరకన్నా ఎక్కువైనా వినియోగదారులు కొనుగోలు చేశారు. చికె న్ సెంటర్ల బంద్ మాంసం విక్రయాలు కూడా 20 నుంచి 25 శాతం పెరిగినట్టు మాంసం విక్రయదారులు తెలిపారు. చికెన్ అమ్మకాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయం గా మాంసం కొనుగోలు చేయడానికి ఎక్కు వమంది మొగ్గు చూపారు. చికెన్ సెంటర్ల బంద్ లో భాగంగా బుధవారం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద జరిగిన మహా ధ ర్నాలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి చికెన్ సెంటర్ల నిర్వాహకులు పాల్గొన్నారు. తమ డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని నినా దాలు చేశారు. అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలని, విధాన పరంగా చికెన్ ధరలు, కమీషన్ మార్జిన్ ధరలు నిర్ణయించాలని, చిల్లర చికెన్ వ్యాపా రులు లేకుండా చేయాలని, పౌల్ట్రీ కంపెనీల కుట్రను అడ్డుకోవాలని కోరుతూ నినాదాలు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *