ఈ తరం పాఠకులకు దగ్గరవుతాం!

బుక్‌ఫెయిర్ లాంటి ఒక బిజినెస్ ఈవెంట్ తప్ప పూర్తిగా సాహిత్యమే మాట్లాడుకునే ఈవెంట్ మనం హైదరాబాద్‌లో ఎందుకు చేసుకోలేమని. నిజానికి ఆ బుక్‌ఫెయిరే లేకపోతే తెలుగు సాహిత్యంలో ఇంతమంది రచయితలు, పాఠకులు కలుసుకునే వేదిక ఒకటి ఉండేదే కాదేమో. అయితే ఎంతైనా అది పుస్తకాల పండుగ. మనకు అచ్చంగా సాహిత్యం గురించి మాట్లాడుకునే వేదికలు కావాలి. హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్ ఒకటి తెలుగు నేల మీదనే జరుగుతున్నా అందులో తెలుగు సాహిత్యాన్ని రిప్రజెంట్  చేసేవాళ్ళు వేళ్ళమీద లెక్కబెట్టేంతమంది. ఈ పరిస్థితుల్లో తెలుగులో ఛాయా లిటరేచర్ ఫెస్టివల్ నిర్వహించాలన్న ఆలోచన అభినందించదగ్గది.

ఛాయ మోహన్ బాబు, అరుణాంక్ లత గత రెండు మూడేళ్ళుగా ఇలాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలన్న తమ ఆలోచనను చెప్తూ ఉన్నారు. ఇప్పటికి అది నెరవేరి యాభైమంది స్పీకర్లతో నాలుగువేదికలమీద ఒకరోజంతా జరిగే సాహిత్యోత్సవం ఇంకోవారం రోజుల్లో జరగనుందంటే నాకైతే చాలా ఉత్సాహంగా ఉంది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లాంటి పాపులర్ సోషల్ మీడియాలో మీమ్స్ చేస్తూ సాహిత్యాన్ని కూడా సెలబ్రేట్ చేసే తరం వచ్చింది. వారికి ఇలాంటి లిటరేచర్ ఫెస్టివల్ సాహిత్యాన్ని ఇంకా దగ్గర చేస్తుందని నమ్మతున్నా. ఈ ఏడాది ఒక్కరోజు జరుపుకుంటున్న ఈ ఉత్సవం రాబోయే సంవత్సరాల్లో జైపూర్, హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్స్ లాగా మూడురోజులు వైభవంగా జరిగేలా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా.

-వి. మల్లికార్జున్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *