ఇతర రాష్ట్రాలవారు జాతీయ సదస్సులు పెట్టి తెలుగు నుంచి కొందరు రచయితల్ని పిలిచినప్పుడు అందరం హర్షిస్తాం కానీ మనగడ్డమీద, మనంకూడా ఇతరభాషల నుంచి రచయితలని పిలిచి జాతీయస్థాయిలో వేదిక కల్పించడం గర్వంగా ఉంటుంది. ఆ వేదిక ఛాయా రిసోర్సెస్ అవడం మరీ ఆనందం. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న అనేక ప్రచురణసంస్థల్లో కచ్చితంగా ఛాయా విభిన్నమైనది.
ప్రచురణ సంస్థలు కొత్త రచయితలని ప్రోత్సహించాలి, లేదా పెద్ద రచయితల రచనలనే తేవాలని, ఫలానావాదాన్నే ప్రచురించాలని ఫలానా సాహిత్యాన్ని పుస్తకరూపంలో తీసుకురావాలని పెట్టుకునే ఆంక్షలు ఛాయాలో కనిపించవు. అనువాదానికి, భాషలకు పెద్దపీట వేసింది కూడా ఛాయనే. తక్కువ సమయంలో ప్రచురణలకు ఛాయ బలమైననీడలా మారింది. ఇప్పటికే ఛాయా చేస్తున్న లిటరరీ ఫెస్ట్ సమావేశాల వివరాలు రచయితల పేర్లు చూసి ఆనందం కలుగుతుంది. ప్రతి సంవత్సరం అక్టోబర్ మాసం ఛాయా సాహితీ వాతావరణం నింపుకుంటుందని చేసిన వాగ్దానం భరోసాను ఇస్తోంది. సాహిత్యానికి, భాషలకి అవసరమైన కృషిచేస్తున్న ఛాయావారికి నా హృదయపూర్వక అభినందనలు.





