విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితులు

– పూర్తిగా గతితప్పిన ఆటోమేటిక్‌ వ్యవస్థలు
– విమానాల రద్దు.. ప్రయాణికుల ఆందోళన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8 రెండు రోజుల నుంచి భారత్‌లోని పలు విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి ఢల్లీిలోని ఏటీసీ ఆటోమేటిక్‌ వ్యవస్థ పని చేయలేదు. దీంతో వందల విమానాలు రద్దు చేయాల్సి వచ్చింది. మధ్యాహ్నానికి ముంబైలో అదే పరిస్థితి ఏర్పడిరది. అక్కడ పరిస్థితులు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. ఇలా వరుసగా విమానాశ్రాయాల్లో జరుగుతున్న పరిణామాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. దేశంలోని వివిధ విమానాశ్రయాల్లోని ఏటీసీ అటోమేటిక్‌ వ్యవస్థ పని చేయలేదు. 36 గంటలు దాటిన తర్వాత దిల్లీి, ముంబై, శివమొగ్గ ఎయిర్‌పోర్టుల్లో పరిస్థితులు కంట్రోల్‌లోకి వస్తున్నాయి. అందుకే శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రాంతాలకు వెళ్లే విమానాలను రద్దు చేశారు. ఈ విషయాన్ని ప్రయాణికులకు చెప్పకుండా రద్దు చేయడం గందరగోళానికి కారణమైంది. తమకు ముందస్తు సమాచారం లేకుండా ఇలా చేయడం ఏంటని ప్రయాణికులు ఆందోళనబాట పట్టారు. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిరది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి కౌలాలంపూర్‌, వియత్నాం, గోవా వెళ్లే విమానాలను అర్ధాంతరంగా రద్దు చేశారు. సాంకేతిక కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. దిల్లీ, ముంబై, శివమొగ్గ వెళ్లే విమానాలను కూడా రద్దు చేశారు. దీనికి మాత్రం అక్కడ ఏటీసీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. అర్థరాత్రి వేళలో ఇలా నిర్ణయం తీసుకోవడంతో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. ఎందుకు ఇలాంటి పని చేశారని సిబ్బందిని ప్రశ్నిస్తే రూడ్‌గా సమాధానం చెప్పారని మండిపడ్డారు. గంటల తరబడి ఎదురు చూస్తున్నా వారి నుంచి సరైన స్పందన రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సాంకేతిక సమస్య పరిష్కారమైందని, విమాన కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని విమానాశ్రయ అథారిటీ ప్రకటించింది. దిల్లీ విమానాశ్రయ అథారిటీ ఇచ్చిన ప్రకటనలో ఇలా ఉంది. ‘ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ విమాన ప్రణాళిక ప్రక్రియకు సహాయపడే ఆటోమేటిక్‌ మెసేజ్‌ స్విచింగ్‌ సిస్టమ్‌ను ప్రభావితం చేసే సాంకేతిక సమస్య క్రమంగా మెరుగుపడుతోంది. విమాన కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. సంబంధిత అధికారులందరూ అసౌకర్యాన్ని తగ్గించడానికి పనిచేస్తున్నారు. తాజా విమాన సంబంధిత సమాచారం కోసం ప్రయాణికులు తమ విమానయాన సంస్థతో సన్నిహితంగా ఉండాలని సూచించారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు దిల్లీ విమానాశ్రయంలో 800 కంటే ఎక్కువ విమానాలు ప్రభావితమయ్యాయి. సాంకేతిక సమస్య కారణంగా మూసివేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *