– దండగమారి ఖర్చు తప్ప మరోటి లేదు: ఎంపీ ప్రియాంక
న్యూదిల్లీ, డిసెంబరు 13 : మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ గ్రాంటీ యాక్ట్ (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) పేరును పూజ్య బాపు గ్రామీణ ఉపాథి పథకంగా పేరు మార్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నించడాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాందీ తప్పుపట్టారు. తాజాగా ఈ చట్టం పేరు మార్పుకు సంబంధించిన నివేదికపై ఆమె శనివారం స్పందించారు. పథకం పేరును మార్చే పక్రియ కోసం ప్రభుత్వ నిధులు ఖర్చవుతాయి. ఇది అనవసరమైన పక్రియ అని కేంద్రాన్ని విమర్శించారు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పేరు మార్చడం వెనుక ఉన్న ఆలోచనలేంటో నాకర్థం కాలేదు. మొదట మహాత్మాగాంధీ పేరు పెట్టారు. ఇప్పుడు ఆ పేరును మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ఈ పేరు మార్చే పక్రియ కోసం చాలా ప్రభుత్వ నిధుల్ని ఖర్చు చేయాల్సి ఉంది. కార్యాలయాల నుండి, స్టేషనరీ వరకు.. ఇలా ప్రతిదానికీ పేరు మార్చాలి. ఇది ఖర్చుతో కూడుకున్న పక్రియ. ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? నాకు అర్థం కాలేదు అని ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





