అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల దరఖాస్తు తేదీల్లో మార్పులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 11: రాష్ట్రంలోని 34 ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లోని 607 పోస్టులకు దరఖాస్తుల తేదీల్లో రిక్రూట్‌మెంట్‌ బోర్డు మార్పులు చేసింది. ఈనెల 10 నుంచి 17వ తేదీలోపు దరఖాస్తులు తీసుకోవాల్సి ఉండగా వైద్యుల విజ్ఞప్తి మేరకు మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు మార్పులు చేసింది. ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకూ దరఖాస్తులు తీసుకోనున్నట్టు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 20 నుంచి బోర్డు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు సమయంలో బోర్డు వెబ్‌సైట్‌లో అన్ని సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేయాలని పేర్కొంది. మెడికల్‌ కౌన్సిల్‌ రిజిస్ట్రేషన్‌, కుల ధ్రువీకరణ, తదితర సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి కొంత సమయం కావాలని డాక్టర్లు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *