ఇంటర్‌ ‌పరీక్షలో స్వల్ప మార్పు

– మార్చి 3 నాటి పరీక్ష 4కు వాయిదా

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: ‌తెలంగాణ ఇంటర్‌ ‌పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. మార్చి 3న జరగాల్సిన ఇంటర్‌ ‌సెకండియర్‌ ‌మ్యాథ్స్ 2ఏ, ‌బోటనీ, పొలిటికల్‌ ‌సైన్స్ ‌పరీక్షలను మరుసటి రోజు అంటే మార్చి 4న నిర్వహించనున్నట్లు ఇంట‌ర్ బోర్డు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. మార్చి 3న హోలీ పండగ ఉండటంతో పరీక్షల తేదీలో మార్పు చేసినట్లు వెల్లడించింది. మిగతా పరీక్షలు యథాతథంగా నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్‌ ‌విడుదలైన విష‌యం విదిత‌మే.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *