గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ కమిటీలో మార్పు

– స్పెషల్ అవార్డ్స్ విభాగం జ్యూరీ చైర్మన్ గా తమ్మారెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: రాష్ట్ర ప్రభుత్వం సినిమా రంగానికి ఇచ్చే అత్యున్నత పురస్కారాలైన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ పక్రియను వేగవంతం చేసింది. ఈ క్రమంలో జ్యూరీ కమిటీలో కీలకమైన మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో భాగంగా ఇచ్చే ‘స్పెషల్ అవార్డ్స్’ విభాగం జ్యూరీ చైర్మన్ గా ప్రముఖ నిర్మాత, విశ్లేషకుడు తమ్మారెడ్డి భరద్వాజను ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకు ఈ బాధ్యతల్లో ఉన్న లెజెండరీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు స్థానంలో తమ్మారెడ్డి భరద్వాజ బాధ్యతలు స్వీకరించనున్నారు. చలనచిత్ర పరిశ్రమలో తమ్మారెడ్డికి ఉన్న సుదీర్ఘ అనుభవం, సామాజిక అంశాలపై ఆయనకున్న అవగాహనను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో ఇస్తున్న ఈ అవార్డులు తెలుగు చిత్ర పరిశ్రమలో నూతన ఉత్తేజాన్ని నింపనున్నాయి. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి, కళలను ప్రతిబింబించే చిత్రాలకు ఈ అవార్డులలో ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *