తొలి కోడి కూతతో లేచి
గరం గరం చాయ్ కై ఆరాటం
పాచి ముఖంతో సేవించే
అమృత దారిని బెడ్ చాయ్…….
చాయ్ బిస్కెట్ కై పిల్లలు
గబ గబ రడి అయి ఖాళీ గ్లాస్ తో
గీ గీ అంటు అమ్మ చుట్టు తిరుగుతూ
వేడి వేడి చాయ్ ని ష్ ష్ ని ఊదుతూ
బిస్కెట్లు అద్దుతూ పోటి పడి ఆరగిస్తారు…….
వేడి వేడి చాయ్ తో శరీరములో
వేడితో పాటు కొంచెం శక్తిని పొందుతుంటారు
ఇంట్లో వారంతా…..
ఉద్యోగులు విధి నిర్వహణలో
చాయ్ తాగుతూ స్ట్రెస్ నుండి ఉపశమనం…..
సాయంత్ర వేళ స్నేహితులతో
బయటకి వచ్చి చాయ్ బిస్కెట్ తింటూ
ముచ్చటిస్తారు….
ఇంటికి వచ్చిన అతిథులకు,
పెళ్ళి చూపులో బంధం కూడా
చాయ్ బిస్కెట్ తోనే మొదలు అవుతుంది…..
సంతోషానికైన, బాధకైనా చాయ్ బిస్కెట్
మత్తు అలవాటు లేని వారికి
చాయ్ బిస్కెట్ ప్రధానమైనది
చాయ్ బిస్కెట్ కు అభిమానులు ఎందరో…..
– మిద్దె సురేష్, కవి, వ్యాసకర్త
9701209355




ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల