– తల్లిదండ్రులకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26: భారతదేశ భవిష్యత్తును నిర్మించే మన ఆడబిడ్డల ఆరోగ్యం విషయంలో ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. సర్వికల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) ముప్పు నుంచి బాలికలను రక్షించేందుకు ఉచిత హెచ్‌పీవీ టీకా పంపిణీ కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టిందన్నారు. ఈమేరకు ఆయన ‘ఎక్స’లో ఓ పోస్టు పెట్టారు. రాబోయే తరాలను ప్రాణాంతక వ్యాధుల నుండి కాపాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ‘ఆరోగ్య భారత’ దిశగా వేస్తున్న ఈ అడుగు ఎంతోమంది ప్రాణాలను కాపాడటమే కాకుండా ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసానిస్తుందన్నారు. మీ ఇంట్లో 14-15 ఏళ్ల బాలికలు ఉంటే సమీపంలోని ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లి ఈ ఉచిత టీకాను ఇప్పించాలని తల్లిదండ్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు.సర్వికల్ క్యాన్సర్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అంటూ పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





