- రేపటి నుంచి తెలుగు వర్సిటీలో ప్రక్రియ
హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్10: గ్రూప్-3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను టీజీపీఎస్సీ పరిశీలించనుంది. మంగళవారం నుంచి హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనుంది. ఈ పక్రియ నవంబర్ 26 వరకు కొనసాగనుంది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీశీలన జరుగనుందని టీజీపీఎస్సీ వెల్లడించింది. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్ధులు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు 2 జిరాక్స్ సెట్లు కూడా తమతోపాటు తీసుకురావాల్సి ఉంటుంది. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్ల జాబితాను టీజీపీఎస్సీ ఇప్పటికే వెరిఫికేషన్‌కు ఏ రోజు, ఏ షెడ్యూల్‌లో హాజరు కావాలనే పూర్తి వివరాలను అందుబాటులో ఉంచినట్లు కమిషన్ కార్యదర్శి ప్రియాంక వెల్లడించారు. అభ్యర్థులు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం హాజరు కావాలని సూచించారు. కాగా, కమిషన్ పేర్కొన్న తేదీలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాని అభ్యర్థుల అభ్యర్థిత్వం తదుపరి పక్రియకు పరిగణించబడదని స్పష్టం చేశారు. వెరిఫికేషన్‌కు హాజరైన వారికి సంబంధించి ఏవైనా పెండింగ్‌లో ఉన్న పత్రాలు ఉంటే, వాటిని నవంబర్ 29 (రిజర్వ్ డే) సాయంత్రం 5 గంటల తర్వాత అంగీకరించబడవని వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





