యూరియాపై కేంద్రం సానుకూల స్పందన

– మరో 50వేల మెట్రిక్‌ టన్నులు వచ్చే వారంలోగా చేరుకునే అవకాశం
– ఈ నెలలో ఇప్పటివరకు 1.44 లక్షల మెట్రిక్‌ టన్నులు సరఫరా
– రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: రబీ పంటల సాగు కూడా ఆరంభం అవుతున్న ఈ సమయంలో రైతులకు అవసరమైన యూరియా సరఫరాలో లోపం కలగకుండా చూసే చర్యలను ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుంటోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిరంతర వినతులు, దిల్లీ వెళ్లి మంత్రులను పలుమార్లు కలసి చేసిన అభ్యర్థనలకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. సెప్టెంబర్‌లో రాష్ట్రానికి మొత్తం 1.17 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇంపోర్టెడ్‌ యూరియా కేటాయింపునకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాన నౌకాశ్రయాల ద్వారా కేటాయించిన యూరియా రాష్ట్రానికి చేరుతుంది. ఈనెలలో ఇప్పటివరకు రాష్ట్రానికి 1.44 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరా అయింది. కేంద్రం అదనంగా కేటాయించిన ఇంపోర్టెడ్‌ యూరియాలో ప్రస్తుతం 30వేల మెట్రిక్‌ టన్నులు లోడిరగ్‌లో ఉండగా రాబోయే వారంలో మరో 50వేల మెట్రిక్‌ టన్నులు లోడిరగ్‌ పూర్తి కానున్నది. అలాగే 30వేల మెట్రిక్‌ టన్నులు ఇప్పటికే ట్రాన్సిట్‌లో ఉన్నాయి. ఈ సరఫరాతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రానికి యూరియా సరఫరా చేసే ప్రధాన వనరుల్లో రామగుండం ఎరువుల కర్మాగారం కీలకమైనది. గత 90 రోజులుగా ప్లాంట్‌ షట్‌డౌన్‌ కారణంగా ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ పరిస్థితిలో రాష్ట్ర రైతులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మంత్రి తుమ్మల స్వయంగా కేంద్ర రసాయనాల మంత్రిని, కార్యదర్శిని కలుసుకుని రామగుండం యూనిట్‌ను త్వరితగతిన పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎరువుల కొరత లేకుండా, సాగుకు ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు అవసరమైన ప్రతి చర్యను తీసుకుంటోంది. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. యూరియా సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేస్తూ ఉంటుంది అని మంత్రి తుమ్మల రైతులకు హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *