– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవే కారణం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23: గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చొరవతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, గిరిజన మంత్రిత్వ శాఖలు రూ.3 కోట్ల 70లక్షలు విడుదల చేశాయి. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మేడారం చుట్టుపక్కల ఉన్న ములుగు, లక్నవరం, మేడారం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగత జలపాతం వంటి ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం ‘గిరిజన సర్క్యూట్ పేరిట’ గతంలో రూ.80 కోట్లతో ఆయా ప్రాంతాల్లో పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే కాకుండా పలు అభివృద్ధి పనులను కూడా చేపట్టింది. అదేవిధంగా యునెస్కో గుర్తింపు లభించిన రామప్ప దేవాలయ అభివృద్ధి కోసం రూ.140 కోట్ల ఖర్చు చేస్తోంది. అమ్మవార్లకు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు తీర్చుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం జాతర జరిగే నాలుగు రోజులపాటు దక్షిణ మధ్య రైల్వే శాఖ 30 ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



